బాహుబలి బెనిఫిట్ షో టికెట్ రేట్లు అదుర్స్..!


రాజమౌళి భారీ బడ్జెట్ తో తీర్చిదిద్దిన చిత్రం ‘బాహుబలి’ జూలై 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సోషల్ మీడియాలో ఏ సినిమాకు రాని ప్రచారం వచ్చింది. చిత్రయూనిట్ కూడా శక్తి వంచన లేకుండా ప్రమోషన్స్ వర్క్ లో పాల్గొంటున్నారు. సినిమా చేస్తున్నప్పుడు తమ అనుభవాలు అభిమానులతో పంచుకుంటూ ‘బాహుబలి’కి విపరీతమైన ప్రచారం చేస్తున్నారు.

బాహుబలి విడుదల రోజు మార్నింగ్ బెనిఫిట్ షో ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు కోసమే ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 10 న తెల్లవారుజామునా ఈ సినిమా బెనిఫిట్ షో లు చెన్నై , ముంబై తో పాటు హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. అయితే హైదరాబాద్ లో కూడా ఆ రోజు ఉదయం 5 గంటలకే బెనిఫిట్ షో వేస్తున్నట్లు సమాచారం. మరి ఈ బెనిఫిట్ షో టిక్కెట్ల రేట్లు కూడా భారీగానే ఉన్నాయట. కేటగిరీల ప్రకారం టిక్కెట్లు 3,4,8 వేల వరకు ఉండవచ్చని సమాచారం.
source:http://www.apherald.com/Movies/ViewArticle/90387/baahubali-baahubali-movie-baahubali-movie-the-beg/

No comments