డీల్‌: రెహ్మాన్ ని ఒప్పించిన రాజ‌మౌళి


ఇక నుండి టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంటే సౌత్ మార్కెట్ లో అతి పెద్ద మార్కెట్. అలాగే ఇండియ‌న్ మార్కెట్ లో టాలీవుడ్ ది ప్ర‌త్యేక‌మైన స్థానం... ఇలా చెప్పుకునే రోజులు త్వ‌ర‌లోనే రానున్నాయి. దీనంత‌టి కార‌ణం ఎంద‌రో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల కృషి. అయితే చివ‌ర‌గా మాత్రం ఆ కృషిని ప్ర‌పంచానికి చాటిచెప్పింది మాత్రం ఒక్క రాజ‌మౌళినే.రాజమౌళి త‌న అప్ క‌మింగ్ మూవీ బాహుబ‌లితో టాలీవుడ్ బ్రాండ్ ని ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపిస్తున్నాడు.

బాహుబ‌లి మూవీ హిట్టా, ప‌ట్టా పక్క‌న పెడితే... టాలీవుడ్ లో భారీ సినిమాలు తీయ‌గ‌ల ద‌ర్శ‌కులు, నిర్మించ‌గ‌ల నిర్మాత‌లు, టాలెండెట్ టెక్నిషియ‌న్స్, యాక్ట‌ర్స్ ఇలా ప్ర‌తి విభాగానికి సంబంధించిన వారు ఉన్నారు అంటూ చాటి చెప్పాడు రాజ‌మౌళి. ఇదిలా ఉంటే త్వ‌ర‌లోనే రాజ‌మౌళి, ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్‌.రెహ్మాన్ తో క‌లిసి ప‌నిచేయ‌నున్నారు. దీనికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, రాజమౌళి తన సినిమాలు అన్నిటికి కీరవాణి నే సంగీత దర్శకుడు గా పెట్టుకున్నారు.

రాజమౌళి ఎదుగుదలలో  కీరవాణి,ఆయన భార్య వల్లి ల సహకారం చాలా అమూల్యమైనది. అయితే కీర‌వాణి అనంత‌రం, రాజ‌మౌళి ఎవ‌రిని మ్యూజిక్ డైరెక్ట‌ర్ పెట్టుకుంటాడ‌నేది తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో దోబూచులాడే ప్ర‌శ్న‌. అందుకు రాజ‌మౌళి జ‌వాబుగా రెహ్మాన్ ని ఎంచుకున్నాడు. అందుకు రెహ్మాన్ ని ఒప్పించాడు కూడ‌. దీంతో కీర‌వాణి అనంత‌రం రాజ‌మౌళి ప్ర‌యాణం రెహ్మాన్ తో ఉంటుంద‌నేది సౌత్ మార్కెట్ లో వినిపిస్తున్న ఓపెన్స్ టాక్స్
ఇప్ప‌టి వ‌ర‌కూ రెహ్మాన్ ని సౌత్ మార్కెట్ లో డిమాండ్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కులు ఇద్ద‌రి మాత్ర‌మే క‌చ్ఛితంగా ఉన్నారు. వారే మ‌ణిర‌త్నం, శంక‌ర్‌, క‌మ‌ల్ హాస‌న్‌. ఇప్పుడు ఆ లిస్ట్ లో రాజ‌మౌళి చేర‌బోతున్నాడు. మ‌రి వీరిద్దరి కాంబినేష‌న్ లో ఎప్పుడు మూవీ వ‌స్తుంద‌నేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి బాహుబ‌లి మూవీకి సంబంధించిన రిలీజ్ ప‌నుల్లోనూ, ప్ర‌చారాల్లోనూ బిజిగా ఉన్నాడు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/90327/rehaman-rajamouli-keeravani-valli-tollywood-kollyw/

No comments