త్వరలోనే బాలీవుడ్ స్టేజ్ పై మహేష్ బాబు
ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని కొనసాగిస్తున్నాడు.ఇదిలా ఉంటే, మహేష్ బాబు త్వరలోనే బాలీవుడ్ లోని టాప్ హీరోల సరసన నిల్చోబోతున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మహేష్ బాబు ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ శ్రీమంతడు షూటింగ్ ని పూర్తి చేసి, బ్రహ్మోత్సం మూవీ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు.
అయితే త్వరలోనే మహేష్ బాబు బాలీవుడ్ లోని బడా స్టార్స్ మధ్యలో నిలుచోబోతున్నాడు. ఎందుకంటే మహేష్ బాబు ఇప్పటికీ బేవరేజ్ బ్రాండ్స్ అయిన థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. కోకాకోల కంపెనీ, ఇప్పటి వరకూ బ్రాండ్ అంబాసిడర్స్ గా కొనసాగిన వారందరిని కలిపి ఒకే వేధికపై పిలిచి, వారితో కోకాకోలా సెలబ్స్ అంటూ ఓ స్పెషల్ కార్యక్రమం చేపట్టబోతుంది.
దీంతో ఇప్పటివరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే కోకాకోలా కంపెనీ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారో, వారందరూ త్వరలోనే ముంబాయిలోని అతి పెద్ద డయాస్ మీద కలవనున్నారు.
అందుకే మహేష్ త్వరలోనే బిటౌన్ బడా స్టార్స్ మధ్య నిలుచోనున్నాడు. అయితే గతంలో చిరుసైతం థమ్స్ అప్ కి ప్రచారకర్తగా ఉన్నాడు. మరి చిరు ఈ కార్యక్రమానికి హాజరు అవుతాడా? లేదా? అనేది చూడాలి మరి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/90465/maheshbabu-telugu-films-telugu-news-tollywood-boll/
Post a Comment