ఈటీవీ వేడుకలో కలిసిన పవన్ కళ్యాణ్, చిరంజీవి


మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఒకే వేదికపై చూడాలన్న మెగా అభిమానుల కోరిక ఈటీవీ అధినేత రామోజీరావు తీర్చినట్టు టాక్.

విషయంలోకి వెళితే గతంలో నాగబాబు కొడుకు వరున్ తేజ్ సినిమా ప్రారంభోత్సవంలో చిరంజీవి, పవన్ కళ్యాన్ లు హాజరైనా ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడకుండా అభిమానులను నిరాశపరిచారు. తరువాత మళ్ళీ వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించలేదు. కనిపిస్తారనుకున్న ప్రతిసారీ అవన్నీ గాసిప్పులుగానే మిగిలిపోయాయి.

అయితే తాజాగా వీరిద్దరి మద్యా  బంధం గట్టిపడినట్టు టాక్. ఈ విషయాన్ని గ్రహించిన ఈటీవీ అధినేత రామోజీరావు, ఈటీవీ 20 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి దానికి మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారిచేత మాట్లాడించినట్టు టాక్.

అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో అన్నదమ్ములు ఇద్దరూ ఒకరిగురించి ఒకరు మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రోగ్రాం ఇంకా టీవీలో ప్రసారం చేయలేదు. త్వరలోనే ప్రసారం చేసెందుకు రంగం సిద్దం చేస్తున్నారట. దీనికి సంబందించిన ఒక ప్రోమో కూడా వెబ్ మీడియాలో హల్ చల్ చేసెస్తుంది.

అసలు ఈ అన్నదమ్ములు ఒకరిగురించి ఒకరు ఎం మాట్లాడుకున్నరు? అని మెగా అభిమానుల్లోనే కాకుండా అందరిలోనీ ఉత్ఖంట ఏర్పడినట్టు టాక్. ఇంకా పవన్ గెడ్డం గురించి చిరంజీవి ఏదో కామెంట్ చేశాడట.

అయితే అసలు వీరిద్దరూ ఒకే ఫంక్షన్లో ఒకే వేదికపై కలిశారా? మాట్లాడుకున్నారా? వీటన్నిటికీ సమాదానం తెలియాలన్నా, ఇవన్నీ నిజమో కాదో తెలియాలన్నా కొన్నిరోజులు ఆగాల్సిందే.

No comments