ప్రపంచ చలనచిత్ర చరిత్ర పార్ట్ -2
“చెవులకి ఫోనోగ్రాఫ్ ఎలాగో, కంటికి కూడా అలాంటి పరికరాన్ని కనిపెడతాను” అని థామస్ ఆల్వా ఏడిసన్ ప్రకటించాడు. గ్రీకు పదాలు “కినిటో” (చలనం), “స్కోప్” (దర్శించు) కలిపి “కినెటోస్కోప్” (చలన దర్శని)అనే పేరు ఆ పరికరానికి నిర్థారించాడు ఎడిసన్. అయితే ఆ పరికరాన్ని ఎలా తయారు చెయ్యాలో అప్పటికికా అతనికి తెలియదు.. అప్పటికే మైబ్రిడ్జి చేసిన ప్రయోగాల ఫలితంగా జూప్రాక్సిస్కోప్ అనే అ పరికరం రూపొందించబడింది. మరో పక్క ఫ్రాన్స్‌లో లుమినరి బ్రదర్స్ కదులుతున్న బొమ్మల చిత్రాల్ని తీసేందుకు, చూసేందుకు వీలైన పరికరాలు తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఎడిసన్ అమెరికా పేటంట్ ఆఫీసులో (1888 అక్టోబర్) కెవిట్ దాఖలు చేయడానికి మూడు రోజులు ముందే ఇంగ్లాండులో లూయీస్ లీ ప్రిన్స్ ప్రపంచంలోనే తొలి చిత్రం “రౌన్‌ధే గార్డెన్ సీన్” తీసాడు. ఈ పరిస్థితిలో సినిమా చూసేందుకు ఒక పరికరాన్ని తయారు చెయ్యాలని ఎడిసన్ భావించాడు.
అంతకు కొన్ని రోజుల ముందే ఎడ్వర్డ్ మైబ్రిడ్జ్, ఎడిసన్‌ని కలిసి తన జూప్రాక్సిస్కోప్ గురించి చర్చించాడు. అనేక కెమేరాలలో వరసగా ఫోటోలు తీసి వాటన్నిటిని కలిపి చూపించడం ద్వారా కదులుతున్న బొమ్మలను చూపించడం సాధ్యం అని వివరించాడు. అలాంటి పరికరాల్ని తయారు విషయం ఎడిసన్ తనతో కలిసి పనిచేయాలని ఎడ్వర్డ్ కోరాడు. అయితే ఎడిసన్ అందుకు అంగీకరించలేదు. చలన చిత్రాన్ని తీసేందుకు అనేక కెమెరాలని వాడటం సాధ్యం కాదని, ఒకే కెమెరాతో అనేక ఫోటోలు తీసే పరికరాన్ని తయారు చెయ్యాలని అతను భావించాడు. అదే అలోచనతో ఆయన తన కెనిటోస్కోప్ పేటంట్ కోసం అభ్యర్థన పెట్టుకున్నాడు. తన కల లాంటి ఆ పరికరాన్ని తయారు చేయటం నిజంగా సాధ్యమౌతుందా అని మధన పడుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఆయనకి ఒక కొత్త వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ వ్యక్తి పేరు విలియం కెన్నడీ డిక్సన్ (W.K. Dickson).
డిక్సన్ అప్పటికే ప్రముఖ ఫోటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతని ప్రతిభని గుర్తించిన ఎడిసన్ కెనిటోస్కోప్ తయారు చేసే బాధ్యతని అతనికే అప్పజెప్పాడు. డిక్సన్‌కి సహాయం చేసెందుకు చార్లెస్ ఏ. బ్రౌన్‌ని అనే అసిస్టంట్‌ని కూడా నియోగించాడు ఎడిసన్. వెస్ట్ ఆరంజ్ ప్రాంతంలో వున్న ఎడిసన్ ప్రయోగశాలలో ప్రపంచ చలనచిత్ర చరిత్రని గతిని మార్చే అద్భుత ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఎడిసన్ తయారుచేసిన ఫోనోగ్రాఫ్ తరహాలొనే ఒక సిలిండర్ లాంటి పరికరం మీద బొమ్మలని వరసగా వుంచి ఆ సిలిండర్ ని తిప్పడం ద్వారా కదిలే బొమ్మల్ని చూపించచ్చని ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడితో ఆగిపోయిన ప్రయోగాల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఎడిసన్, డిక్సన్ ఆలోచిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఇతర ప్రయోగాలలో సమాధానాలు దొరికాయి.
ఫ్రాన్స్‌కి చెందిన ఎటినీ జులెస్ మరే అనే ఒక డాక్టర్ కదులుతున్న జీవాల ఫోటోలు తీసే ప్రయత్నంలో క్రోనోఫోటోగ్రఫ్ అనే పరికరాన్ని కనిపెట్టాడు. కదులుతున్న ప్రాణులను (ఆయన ఎక్కువగా పక్షుల ఫోటోలు తీసాడు) ఫోటోలను తీసి వాటన్నింటిని కలిపి ఒకే బొమ్మగా రూపొందించడంలో అయన నిష్ణాతుడు. అయితే ఆ బొమ్మలు పది కన్నా ఎక్కువ ఒక్కసారి తీసేందుకు పొడవైన ఫిలిం కావాల్సి వుంది. అలాంటి ఫిలిం అప్పటికింకా దొరికే పరిస్థితి లేకపోవడంతో అతని ప్రయోగాలు ముందుకు సాగటంలేదు.
ఆ సమస్యకి సమాధానమా అన్నట్టు జాన్ కార్బుట్ అనే ఇంగ్లీషు శాస్త్రవేత్త సెల్యులాయిడ్ అనబడే పొడవైన ఫిలింని కనిపెట్టాడు. “ఏడిసన్ కనిపెట్టిన సరికొత్త విచిత్రం. 19వ శతాబ్దానికే ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఆవిష్కరణ” – ఇదీ 1884 డిసెంబర్ 13 నుంచి 19 వరకూ సియాటిల్‌లోని పోస్ట్-ఇంటలిజెన్సర్, సియాటిల్ డైలీ టైమ్స్ పత్రికల్లో వచ్చిన ప్రకటన. ఆ తరువత కెనిటోస్కోప్ ప్రదర్శన జరిగింది. నాలుగు అడుగుల ఎత్తున్న చెక్కపెట్ట, దానికి ఒక చిన్న రంధ్రం, ఆ రంధ్రంలోనించి చూస్తే లోపల నిలువుగా వుంచిన ఫిలిం, నిర్దేశించినచోట నాణెం వేస్తే వెనుకగా మోటర్ సాయంతో ఫిలిం తిరిగి, ఏడిసన్ బల్బు ద్వారా వచ్చే వెలుగుతో ఆవిష్కృతమయ్యే కదిలే బొమ్మలు. ఇదీ స్థూలంగా అప్పటి సినిమా. ఇలాంటి అనేక కెనిటో స్కోప్‌లతో అప్పటి అమెరికాలొ అనేక కెనిటోస్కోప్ పార్లర్‌లు వెలిశాయి. అయితే ఆర్థికంగా ఇవి అంత విజయవంతం కాకపోవడంతో మరో రకం పరికరాలు తయారు చెయ్యడానికి ఆస్కారం ఏర్పడింది. అలా తయారైన బయోస్కోప్, సినిమాటోస్కోప్, ప్రొజెక్టర్ మొదలైనవి సినిమా ప్రగతికి మరింత దోహదం చేశాయిఈ రెండు ఆవిష్కరణలని కలుపుకోని డిక్సన్ “కెనిటో స్కోప్”ని కనిపెటే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చలన చిత్రం చూసేందుకు దోహద పడే ఆ తొలి కెమెరా 1891 కల్లా సిద్ధమైంది. తరువాత 1893 మే 9న బ్రూక్‌లైన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో కెనిటోస్కోప్ తొలి ప్రదర్శన జరిగింది. ఆ తరువాత సంవత్సరం లోనే కెనిటోస్కోప్ ప్రజల ముందుకి వచ్చింది.
Post a Comment