రివ్యూ: బాహుబలి
రివ్యూ: బాహుబలి
రేటింగ్: 3.25/5
తారాగణం: ప్రభాస్, రాణా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా, నాజర్, శేష్ అడివి, ప్రభాకర్, రోహిణి, సుదీప్ తదితరులు
కథ: విజయేంద్రప్రసాద్
కళ: సాబు సిరిల్
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
పోరాటాలు: పీటర్ హెయిన్స్
ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్ కుమార్
సమర్పణ: కె. రాఘవేంద్రరావు
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
కథనం, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
విడుదల తేదీ: జులై 10, 2015
ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి మూడేళ్ల పాటు శ్రమించింది. ఒక 'చందమామ కథ' రెండొందల కోట్ల వ్యయంతో దృశ్యరూపం దాల్చింది. ఆ దర్శకుడి స్వప్నం, ఆ బృందం పడ్డ కష్టం, ఆ నిర్మాతలు పడ్డ ఇష్టం దానిపై అంచనాలు పెంచింది. 'బాహుబలి' కోసం సినీ ప్రియుల హృదయం 'ధన' స్వాగతం పలుకుతూ తివాచీ పరచింది. అంచనాల శిఖరాల్ని అధిరోహించి, ఆశల ఆకాశపుటంచుల్ని చుంబించి, చరిత్ర ఎరుగని రీతిలో అశేష జనవాహినిని ఆకర్షించిన ఆ 'బాహుబలి' అందుకు తగ్గట్టే తెరకెక్కిందా? హద్దుల్లేకుండా ఏర్పడిన అంచనాల ఎత్తులని చేరుకోగలిగిందా? పరిమితుల్లేకుండా పెరిగిన నమ్మకానికి న్యాయం చేయగలిగిందా?
'బాహుబలి' నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినట్టయితే నిరాశకి చోటే ఉండదు. బాహుబలి నుంచి ఒక మరపురాని సినిమా చూసిన అనుభూతిని కోరుకున్నట్టయితే, రాజమౌళి సినిమాలకి రాజముద్ర అయిన భావోద్వేగాల జడిలో ఒళ్లు గగుర్పొడిచే 'వినోదాన్ని' ఆశించి వెళితే మాత్రం కొంత నిరుత్సాహం తప్పదు. మొట్టమొదటిసారిగా రాజమౌళి తన కథనం, భావోద్వేగాల కంటే హంగుల మీద దృష్టి నిలపడం ఆశ్చర్యపరుస్తుంది. రాజమౌళి మసాలా సినిమాలు తీసినా, గ్రాఫిక్స్‌తో మాయాజాలం చేసినా వాటిని బలమైన భావోద్వేగపు పునాదుల మీదే నిలబెట్టాడు. అది తన 'స్టాంప్'! విలన్‌ని హీరో చంపేయాలన్నంత కసి పుట్టించడం, ఆ ప్రాసెస్‌ని ప్రతిక్షణం ఆస్వాదించేట్టు చేయడం తన సిగ్నేచర్. బాహుబలి కోసం ఎంచుకున్న కథలో రాజమౌళి సినిమాల్లో ఉండే ముడి సరుకంతా ఉంది. కాకపోతే రెండు భాగాలుగా విడిపోయిన కథ వల్ల కథనం గతి తప్పింది.
సైనికుల్ని, ఆయుధాల్ని రాణా, ప్రభాస్‌కి పంచి ఇచ్చే సన్నివేశంలో నాజర్ వివక్ష చూపించి రాణాకి ఎక్కువ ఇచ్చి, ప్రభాస్‌కి తక్కువ ఇస్తాడు. అలాగే ఈ కథని రెండు భాగాలు చేసినప్పుడు రాజమౌళి, కథకుడు కలిసి మొదటి భాగంపై వివక్ష చూపించినట్టున్నారు. కథలోని కీలక ఘట్టాలన్నీ రెండో భాగానికి అట్టి పెట్టి మొదటి భాగంలో అంత బలం నింపలేదు. తనకి తక్కువ సైన్యం, ఆయుధాలు ఇచ్చినా కానీ ప్రభాస్ తెలివిగా తన వద్ద ఉన్న వనరుల్నే వాడుకుని రణరంగంలో రాణిస్తాడు. కానీ పట్టున్న ఘట్టాలు ఎక్కువ లేని ఈ మొదటి భాగం కథని అంతే చాకచక్యంగా నడిపించడంలో రాజమౌళి పూర్తిగా విఫలం కాలేదు కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
పలు సన్నివేశాల్లో కాలయాపన జరిగింది. కొన్ని సన్నివేశాల అవసరమే లేదనిపించింది. మరికొన్ని చోట్ల కథ కదలకుండా బిగుసుకుపోయింది. ఇదే కథని ఒకటే సినిమాగా తేల్చేసినట్టయితే తప్పకుండా ఇంతకు ఎన్నో ఇంతలు సంతృప్తినిచ్చే చిత్రమై ఉండేది. బల్లాలదేవుని (రాణా) చేతిలో బాహుబలి (ప్రభాస్) చనిపోయాడనే సంగతి ట్రెయిలర్స్‌లోనే రిజిష్టర్ అయింది. ఆ ఘట్టాన్ని ఈ భాగంలో లేకుండా చేసేశారు. దాంతో ఈ మొదటి భాగంలో 'బాహుబలి' వీరోచిత లక్షణాలు చూపించడానికి తగిన అవకాశమే లేకుండా పోయింది. చివర్లో కాలకేయులతో యుద్ధ ఘట్టాన్ని పెట్టి అందులో బాహుబలి బలమెంతో చూపించే ప్రయత్నమైతే చేసారు కానీ అతనికి ధీటైన ప్రతినాయకుడిని ఈ భాగం వరకు నిలబెట్టలేకపోయారు. దాంతో బాహుబలి బలం మొత్తం శివలింగాన్ని మోసేందుకు, బండల్ని ఒంటి చేత్తో పడేసేందుకు, వంద అడుగుల విగ్రహాన్ని పడకుండా ఆపేసేందుకు వాడుకుని అక్కడే హీరోయిజం వెతుక్కోవాల్సి వచ్చింది.
బాహుబలిలో మరో డిజప్పాయింటింగ్ ఎలిమెంట్ ఏంటంటే... చాలా సన్నివేశాల్లో అసహజత్వం నిండిపోయింది. నమ్మశక్యం కాని సన్నివేశాలని పేర్చుకుంటూ పోవడంతో ఒక దశలో అక్కడ హీరోయిజం చూపించే తపన తెలుస్తున్నా కానీ దానిని హర్షించే అవకాశం లేకుండా పోయింది. జలపాతాన్ని దాటేసే సన్నివేశంలో విజువల్ ఎఫెక్ట్స్ అమితంగా ఆకట్టుకున్నా కానీ దానిని తీసిన విధానం మాత్రం చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. ఇక అవంతిక (తమన్నా) పాత్ర చిత్రణ, ఆమెని పరిచయం చేసిన తీరు... తర్వాత శివుడితో (ప్రభాస్) పరిచయం కాగానే ఆమెలో తక్షణం వచ్చేసే మార్పు కృతకంగా అనిపిస్తుంది. వీరిద్దరి మధ్య నడిచే ప్రేమకథ అలరించకపోగా, అసలు కథకి అడ్డు పడింది. అయితే రాజమౌళి నుంచి ఏ క్షణంలో అయినా ఒక స్పెక్టాక్యులర్ సీన్ వస్తుందనేది తెలిసిన సంగతే కనుక ఓపిక పట్టిన వారికి ఇంటర్వెల్ సీన్ నుంచి, పోస్ట్ ఇంటర్వెల్‌లో ఒక పావుగంట వరకు 'గూస్‌బంప్స్' మూమెంట్స్ దక్కుతాయి. శివుడు నేనెవర్ని అని అడిగే సందర్భం, దానికి ముందు జరిగే పోరాట సన్నివేశం, భద్రుడి తల నరికే దృశ్యం.. రాజమౌళి ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడనే నమ్మకాన్ని కలిగిస్తాయి. కట్టప్ప (సత్యరాజ్) చిన్నప్పుడు శివుడి పాదాల్ని తన తలపై పెట్టుకున్న దృశ్యాన్ని సింక్ చేస్తూ... ఇప్పుడు తన తలపై శివుడి పాదాన్ని ఉంచుకునే షాట్ రాజమౌళిలోని గ్రేట్ డైరెక్టర్‌కి, మాస్ పల్స్‌పై తనకున్న పట్టుకి నిదర్శనంగా నిలుస్తాయి.
బాహుబలి గాడిన పడిపోయిందని, ఇక రాజమౌళి తాండవం ఖాయమని అనుకుంటోన్న సమయంలోనే మళ్లీ నీరసమైన సన్నివేశాలతో, అవసరం లేని ఐటెమ్ సాంగ్‌తో విసిగిస్తుంది. కాలకేయులతో యుద్ధ ఘట్టం ఎక్కువ సమయం సాగదీసినట్టు అనిపించినా కానీ, ఇలాంటి దృశ్యాలు ఒక భారతీయ చిత్రంలో ఊహించడానికి కూడా ఇంతకుముందు ఎవరూ ధైర్యం చేయలేదనేది ఒప్పుకుని తీరాలి. ఇలాంటి సన్నివేశాలు చూడాలంటే కేవలం మల్టీ మిలియన్ డాలర్ల హాలీవుడ్ సినిమాల్లోనే సాధ్యమనుకునే వారికి, రాజమౌళి ఇక్కడే చేసి చూపించాడు. దార్శనికుడిగా రాజమౌళిని తప్పుబట్టడానికి ఏమీ లేదు. కాకపోతే ఎప్పుడూ తన కథకి హంగులు జత చేసే రాజమౌళి ఈసారి హంగుల్ని నమ్ముకుని స్క్రిప్టు బలంగా రాసుకోలేదు. బాహుబలి మొదటి భాగం వరకు అదే కంప్లయింటు. కాకపోతే రెండో భాగంలో కావల్సినంత ఎమోషనల్ డ్రామా ఉంటుందనే నమ్మకం ఇది చూస్తేనే కలుగుతుంది కనుక పూర్తి సినిమా చూసే వరకు రాజమౌళి ఎఫర్టుని కరెక్టుగా రేట్ చేయలేం.
రెండు భాగాలుగా కథని విడగొట్టినప్పుడు కథ సగం మాత్రమే చెప్పారనే అసంతృప్తి కలగకుండా చేయడం అసాధ్యమే కానీ అలా చేయడం తప్పనిసరి అనుకున్నప్పుడు వీలయినంత తృప్తి పరిచేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దడం, ముగించడం చాలా అవసరం. కాలకేయుల యుద్ధ ఘట్టమే ప్రేక్షకుల తృష్ణ తీర్చేస్తుందని భావించినట్టయితే కనుక తప్పు లెక్క వేసారనేది నిజం. బాహుబలి, బల్లాలదేవ కంటే ఇందులో శివగామి (రమ్యకృష్ణ), కట్టప్ప పాత్రలకే ఎక్కువ వెయిట్ వచ్చిందంటే ఆ బ్యాలెన్స్ లోపించడమే కారణం.
ప్రభాస్ పాత్రకి తగ్గట్టుగా కనిపించాడు. అతనితో కొన్ని నమ్మశక్యం కానివి చేయించినా కానీ కాస్తయినా నమ్మకం కలిగించేలా ఉన్నాడు. రాణా విలనీని ఇందులో పూర్తిగా చూసే అవకాశం రాలేదు. తను వున్న సీన్స్‌లో రాణా మెరిపించాడు. రమ్యకృష్ణ ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచింది. ఆమె అభినయం బాహుబలికి నిండుదనం తెచ్చింది. అనుష్క ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. సత్యరాజ్ నటన బాగుంది. తమన్నా క్యారెక్టర్‌కి కన్సిస్టెన్సీ లేదు. ఆమె నటన కూడా ఆకట్టుకోలేదు. ప్రభాకర్ గెటప్ బాగా కుదిరింది. నాజర్ అనుభవం అక్కరకొచ్చింది.
విజువల్ ఎఫెక్ట్స్ చేసిన వారే ఈ చిత్రానికి హీరోలు. అద్భుతమైన ఎఫెక్ట్స్‌తో సినిమా స్థాయిని పెంచారు. సెంథిల్ ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. సాబు సిరిల్ కళా దర్శకత్వం.. మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించిన తీరు అమోఘమనిపిస్తుంది. కీరవాణి స్వరపరిచిన పాటలు బాహుబలి స్థాయికి తగ్గ రీతిలో లేవు. నేపథ్య సంగీతం కూడా కొన్ని సన్నివేశాలు మినహా ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. బహుశా రాజమౌళి సినిమాల్లో వుండే స్థాయి భావోద్వేగాలు ఇందులో లేకపోవడం వల్లే ఆయన పనితనంపై ప్రభావం పడిందేమో మరి.
లోపాలెన్ని ఉన్నా కానీ వెండితెరపై చూసి తీరాలనే లక్షణాలకి మాత్రం లోటు లేదు. ఆ గ్రాఫిక్స్ కోసమైనా థియేటర్‌కి వెళ్లి తీరాల్సిందే. విజువల్‌గా భారతీయ సినిమా స్థాయిని పెంచే చిత్రమనడంలో సందేహాలు అక్కర్లేదు. అయితే దృశ్య పరంగా ఎంతటి అద్భుతమైనా, ఎమోషనల్‌గా కదిలిస్తే తప్ప ఇలాంటి సినిమాలు పూర్తి సంతృప్తినివ్వవు. రాజమౌళి నుంచి వచ్చిన బ్యాడ్ మూవీ అయితే కాదు కానీ, తననుంచి జనం ఆశించే స్థాయిలో మాత్రం లేదు. లోటు, లోపాలు బాహుబలి బాక్సాఫీస్ వద్ద చేసే విధ్వంసానికి ఉన్నపళంగా అయితే సంకెళ్లు వేయలేవు. అంతలో ఎన్ని రికార్డులు చరిత్రలో కలిసిపోతాయో, ఇంకెన్ని కొత్త చరిత్ర సృష్టిస్తాయో మరి!
source:http://telugu.greatandhra.com/movies/reviews/review-baahubali-63393.html#sthash.D2vH3erQ.dpuf

Post a Comment