బాహుబలి లో కల్లు వ్యాపారిగా కనిపించిన జక్కన్న


ఎస్.ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టస్త్మకంగా రూపొందించిన తన డ్రీమ్ ప్రాజెక్టు ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషలో నిన్న విడుదల అయ్యింది. ఇంతవరకూ ఏ సినిమాకీ రాని ప్రచారం ఈ సినిమాకి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా నేషనల్ లెవల్ లో వచ్చింది. ఈ ప్రాజక్ట్ అనుకున్నపటి నుండి విపరీతమైన హైప్ వచ్చింది. మీడియా కూడా దీనిని అడగకుండానే ప్రచారం చెసింది.

అయితే ఈ సినిమాలో చాన్స్ కోసం చాలా మంది స్టార్స్ ఇంట్రెస్ట్ చూపించారు కాని అది కొందరినే వరించింది. ఇక ఈ సినిమాకి హీరో ప్రభాస్ అయినప్పటికీ, రాజమౌళినే నిజమైన హీరో. అందులూనూ తన డ్రేం ప్రాజక్ట్.  తన సినిమాలో తన కోరిక తీర్చేసుకున్నడు.

అదేమిటంటే ఇంత భారీ సినిమాలో తనని తాను చూసుకోవలన్న కోరిక నెరవేర్చుకున్నడు. ప్రభాస్ కు కల్లు అమ్మే వ్యాపారిగా ‘డబ్బుందా’ అనే డైలాగ్ కొడుతూ కనిపించాడు.


ఈ సీన్ చూస్తున్న ప్రేక్షకులు అంత పెద్ద సినిమా సృష్టికర్త తెరపై క్నిపించేసరికి వారి ఆనందానికి అవదులులేకుండా పోయాయి. ఈలలు,కేరింతలతో ఫుల్ హంగామా చేసరు. అప్పట్లో 'సై' సినిమాలో, మొన్న 'ఈగా సినిమాలో అలా మెరిసిన రాజమౌళి 'బాహుబళి 'లో కూడా కనిపించాడు. ఈప్పుడు హీరోలకి ఉన్న క్రేజ్ కి ఏ మాత్రం తీసిపోకుండా రాజమౌళి తన ఇమేజ్ ని పెంచుకున్నాడు. మరి జక్కన్న అలా కనిపించగానే ప్రేక్షకులు ఆగుతారా, ఈలలు, గోలలు చేసి అదరగొట్టేసరు.

No comments