పవన్ కల్యాణ్ నిర్ణయం వెనుక చిరంజీవి !

పవన్ నటిస్తున్న ‘గబ్బ‌ర్ సింగ్2’ టైటిల్ ను ‘సర్దార్’ గా మార్చడం వెనుక చిరంజీవి పాత్ర ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి గతంలో ‘శంకర్ దాదా ఎమ్ బి బిస్’ సినిమాలో నటించిన తరువాత ఆ సినిమాకు సీక్వెల్ గా ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో నటించాడు.

అయితే ఈ సీక్వెల్ ప్రయోగం అప్పట్లో చిరంజీవికి కలిసిరాలేదు. ‘గబ్బర్ సింగ్’ టైటిల్ కు వచ్చిన క్రేజ్ రీత్యా అదే టైటిల్ తో ‘గబ్బర్ సింగ్ 2’ సీక్వెల్ గా తీస్తే మెగా అభిమానులు ఈ సీక్వెల్ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ‘గబ్బర్ సింగ్’ తో పోలుస్తూ ఉండే అవకాసం ఉండటంతో అభిమానులను మెప్పించడం కష్టం కాబట్టి ఈ సీక్వెల్ ప్రయోగాన్ని చేయవద్దని చిరంజీవి పవన్ కు సూచించినట్లు టాక్.


ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకు  డైరక్టర్ బాబి కేవలం దర్శకత్వ బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నాడని ఈ సినిమా స్క్రిప్ట్ మరియు డైలాగ్ వర్షన్ పనిని అంతా రచయిత బుర్రా సాయి మాధవ్ చూస్తూ పవన్ ఇమేజ్ కు తగ్గ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇప్పటికే వ్రాసాడని వార్తలు వస్తున్నాయి. పవన్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాకు సాయి మాధవ్ మంచి డైలాగ్స్ వ్రాసిన నేపధ్యంలో పవన్ ఇస్తున్న ఈ అవకాశంతో ఈ రచయిత కమర్షియల్ రైటర్ గా మారిపోయే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/92211/IS-CHIRU-BEHIND-PAVAN-DECESSION/

No comments