బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న హాట్ భామ..!!

తెలుగు ఇండస్ట్రీలోకి నాగ చైతన్య సరసన ఎంమాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మళియాళి భామ సమంత.  తర్వాత మంచి మంచి సినిమాలు వరుస పెట్టి రావడం అవి సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి తెలుగు  ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత కోలీవుడ్ లో అడుగు పెట్టింది అక్కడ కూడా మంచి హిట్స్ సాధించింది సమంత.  ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో రెండేసి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

మొదట్లో సమంత మొదట్లో మోడలింగ్ చేసేది. సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది.  2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది.

తెలుగు ఇండస్ట్రీనించి బాలీవుడ్ పయనం కట్టి హీరోయిన్ల జాబితాలోకి ఈ అమ్మడు...త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే సమంతది మొదటి నుంచి గోల్డెన్ చాన్సులు కొట్టేస్తూ వచ్చింది ఈ అమ్మడి బాలీవుడ్ ఎంట్ర  కూడా అలాగే జరుగుతుంది.. ఏ ప్రయత్నాలు జరగకుండానే  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

అసలు విషయం ఏమిటంటే  ప్రస్తుతం సమంతా ధనుష్ తో కలిసి వి ఐ పి 2 సినిమాలో నటిస్త్గుంది.  అయితే ఈ సినిమా బాలీవుడ్ లోకి రీమెక్ చేయాలని చూస్తున్నాడు ఆనంద్ ఎల్ రాయ్ ఇక ఈ సినిమాలో ధనుష్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ అమ్మడు కూడా బాలీవుడ్ లో తన భవిష్యత్ పరిక్షించుకోబోతున్నదన్నమాట.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92143/samantha-dhanush-samantha-ruth-prabhu-major-role-a/

No comments