పెళ్లికాని ప్రసాద్ తో త్రివిక్రమ్ సినిమా..?!!

తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత ప్రస్తతానికి ఆయన ఏ సినిమాలు తీయడం లేదు కారణం టాలీవుడ్ లో ఉన్న బిగ్ హీరోలు  పవన్, మహేష్, ఎన్టీఆర్,ప్రభాస్  అంతా బిజీ బిజీగా మారారు. తాజాగా వెంకటేశ్ సోదరుడు నిర్మాత దగ్గబాటి సురేష్ మలయాళంలో హిట్ అయిన ''భాస్కర్ ది రాస్కెల్ '' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో వెంకటేష్ హీరో అయితే దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తీసుకువాలని అనుకుంటున్నారట.  వెంకటేష్ నటించిన ''నువ్వు నాకు నచ్చావ్ '',''మల్లీశ్వరి '' చిత్రాలకు త్రివిక్రమ్ రచన అందించాడు దాంతో ఈ ఇద్దరి మద్య మంచి సాన్నిహిత్యం ఉంది . అలాగే ప్రస్తుతం త్రివిక్రమ్ ఖాళీ గానే ఉన్నాడు. ఈ సంవత్సరం ఈ సినిమాతో మరో హిట్ సాధించాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. 
source:http://www.apherald.com/Movies/ViewArticle/89914/venkatesh-daggubati-suresh-babu-trivikram-srinivas/


No comments