కమల్ హాసన్ విచిత్ర కోరిక..!!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విశ్వనటుడిగా గుర్తింపు పొందిన నటుడు కమల్ హాసన్. ఎంత మంచి నటుడో అంతే వివాదాస్పదుడు. కమల్ హాసన్ బాలీవుడ్ నటి సారికతో వివాహం జరిగింది వారికి ఇద్దరు పాపలు పుట్టారు వాళ్లే శ్రుతిహాసన్, అక్షర హాసన్. ఆ తర్వాత సారికకు బ్రేకప్ చెప్పేసి నటి గౌతమితో సహజీవనం చేస్తున్నాడు. వీరి సహజీవనం చాలా కాలంగా నడుస్తూనే ఉంది. వాస్తవానికి కమల్ హాసన్ కు పెళ్లి పై సరైన అభిప్రాయం లేదట.  అందుకే సహజీవనం వైపే ఎక్కువ మక్కువ చూపించాడు అందుకే గౌతమితో ఇంతకాలం పయనించాడు.

తాజాగా కమల్ ఓ సంచలన కామెంట్ చేసినట్లు సమాచారం. తన విషయంలోనే కాదు కూతుళ్ల విషయంలోనూ ఈ తండ్రి సహజీవనానికే ఓటేస్తాడట. ఇప్పుడు తన కూతుళ్లు స్వతంత్రంగా జీవిస్తున్నారు వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి వారి మనసు నొప్పించే పనులు నేను ఏట్టి పరిస్థితిలోనూ చేయని చెబుతున్నాడు అలాగే వారు సహజీవనం చేసినా కూడా తనకు అభ్యంతరం లేదని ఖరాకండిగా చెబుతున్నాడు.

అంతే కాదు తనకు కూడా మనుమళ్లు, మనుమరాళ్లను ఎత్తుకొని తిప్పాలనే కోరిక ఉన్నట్లు తన కూతురు శృతి పెళ్లి చేసుకున్నా , చేసుకోకపోయినా మనవళ్లు, మనవరాళ్లను ఇస్తే వాళ్లతో గడిపస్తానంటూ సెన్సేషన్‌ కామెంట్‌ చేశాడు. భారత దేశ సాంప్రదాయం ప్రకారం కన్న కూతుళ్లను ఓ అయ్య చేతిలో పెట్టి వారికి పుట్టిన పిల్లలతో హాయిగా ఆడుకోవాలని అనుకుంటారు కాని కమల్ విపరీతమైన కోరిక చూసి ఇండస్ట్రీ వాళ్లు ముక్కున వేళేసుకుంటున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/89862/sarika-kamal-haasan-akshara-haasan-shruti-haasan-n/

No comments