పవన్ స్ట్రిప్ట్ ని జూనియర్ కి వాడుతున్నాడా?

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ మారిన కాంబినేషన్ త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీలో అంచనాలు మించిపోతున్నాయి. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల క్రితమే ఇద్దరి కాంబినేషన్ లో రావాల్సిన మూవీ, ఇంత కాలానికి సెట్ అయింది. అయితే జూనియర్ యాక్సెప్ట్ చేసిన స్టోరి, గతంలో పవన్ కళ్యాణ రిజెక్ట్ చేసిందటూ టాక్స్ వినిపిస్తున్నాయి. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కొన్ని రోజులుగా ఎన్.టి.ఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌పై నందమూరి అభిమానులు కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇటీవలే త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా తర్వాత ఆయన మరే సినిమాకు కమిట్ కాలేదు. ప్రస్తుతం ఆయన పవన్‌కళ్యాణ్ కోబలి చిత్రానికి స్క్రిప్ట్‌వర్క్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్‌తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్, పవన్‌లతో సినిమాలు చేయడానికి రెడీగా వున్నాడు. కానీ వారిద్దరూ వేరే చిత్రాల్లో బిజీగా వుండడంవల్ల ఇప్పట్లో వీరి కలయికలో సినిమా వచ్చే అవకాశం కనబడడం లేదు. దాంతో త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్‌కోసం ఓ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని తెలిసింది.

గతంలో పవన్ కళ్యాణ్ ని ఇంప్రెస్ చేసిన ఓ స్టోరి, అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరువాత అదే స్టోరిని పవన్ కి మళ్ళీ వినిపిస్తే, త్రివిక్రమ్ ని పవన్ సున్నితంగా తిరస్కరించాడంట. కాని అదే ఫీల్ గుడ్ స్టోరిని జూనియర్ యాక్సెప్ట్ చేయటంతో ఇప్పుడది సెట్స్ మీదకు వెళుతందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88752/pawan-kalyan-pawan-kalyan-news-kobali-tollywood-ko/

No comments