బన్నీ అభిమానులను కలవర పెడుతున్న ఆ నిర్ణయం !
అల్లుఅర్జున్ అభిమానులు బన్నీ లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయం పై తీవ్రంగా
కలత చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరువాత
గ్యాప్ తీసుకున్న బన్నీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్న లేటెస్ట్
సినిమాకు హీరోయిన్ గా కోలీవుడ్ బ్యూటీ హన్సికను ఎంపిక చేసుకున్నట్లు
వస్తున్న వార్తలు బన్నీ అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారిందని టాక్.
దీనికి కారణం ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ మీద ఉన్న హీరోయిన్స్ ను వదులుకుని బన్నీ హన్సికతో నటించడానికి ఎలా ఒప్పుకున్నాడు అనేది వారి బాధ. ఒకనాటి ‘దేశముదురు’ సినిమా హిట్ పెయిర్ ను కొనసాగిద్దామని బోయపాటి ఆలోచన ప్రస్తుతం మారిపోయిన యూత్ ట్రెండ్ కు ఎలా సెట్ అవుతుంది అంటూ అల్లుఅర్జున్ అభిమానులు తమ అభిప్రాయాలను అల్లువారి కాంపౌండ్ కు తెలిసేలా తమ వంతు ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టేసారు అనే వార్తలు వస్తున్నాయి.
అల్లుఅరవింద్ నిర్మిస్తున్న ఈసినిమా బడ్జెట్ పెరగకూడదు అన్న నిర్ణయం ఈ సినిమా దర్శకుడి పై ప్రభావితం చేసి బన్నీ హీరోయిన్ గా హన్సిక ఎంపికకు దారి తీసింది అని అంటున్నారు. ఒక దశలో ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని ఎంపిక చేస్తారు అనే వార్తలు వచ్చినా గతంలో బన్నీ హన్సికల కాoబినేషన్ మంచి పేరు తెచ్చుకున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘సన్నాఫ్ సత్యమూర్తి’ బయ్యర్లకు మిగిల్చిన చేదు అనుభవాలతో అటువంటి భారీ సినిమాలు మళ్ళీ తీయకూడదు అన్న ఉద్దేశ్యంతో వ్యుహత్మకంగా అల్లుఅరవింద్ బన్నీ కొత్త సినిమా పై తీసుకున్న నిర్ణయం హన్సికకు కలిసి వచ్చింది అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88673/BANNY-FANS-GETTING-TA-ARCHER-WITH-HIS-DECESSION-/

Post a Comment