హాట్ టాపిక్ గా మారిన అమ్మతో నాని

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును అతడి చిన్నతనంలో అతని కుటుంబ సభ్యులు అంతా ముద్దుగా నాని అని పిలిచేవారు. ఆ ముద్దు పేరు పై ఉన్న మమకారంతో మహేష్ సోదరి మంజుల కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబును హీరోగా పెట్టి ‘నాని’ అన్న సినిమా కూడ తీసింది. తల్లి ప్రేమ చుట్టూ తిరిగే ఆ సినిమాలో మహేష్ నటన బాగున్నా అప్పట్లో ఆ సినిమా సక్సస్ కాలేదు.

తనను చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించిన తన తాల్లి ఇందిర పై ఉన్న ప్రేమతో మహేష్ తన తల్లిని చేయి పట్టుకుని నడిపిస్తూ ఇలా మీడియా కెమెరాలకు చిక్కాడు. మహేష్ బాబాయి సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు జి.ఆది శేషగిరిరావు కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు హాజరైన మహేష్ తన తల్లితో ఇలా నడిచి వస్తూ ఉంటే మహేష్ కొడుకు గౌతమ్ తన తండ్రి మహేష్ వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

ఈ దృశ్యం ఆది శేషగిరిరావు కుమారుడి పెళ్ళి నిశ్చితార్ధ వేడుకకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు అంతా మహేష్ వైపు చూస్తూ ఉండిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర నుంచి నందమూరి సింహం బాలకృష్ణ వరకు ఎందరో హాజరైన ఆ వేడుకకు వచ్చిన అతిధులు అమ్మతో నాని అంటూ కామెంట్ చేసారు.

సామాన్యంగా మీడియా కెమెరాలకు దూరంగా ఉండే మహేష్ ఈసారి మాత్రం తన తల్లిని తాను నడిపిస్తూ ఉంటే తీసిన ఫోటోలకు అభ్యంతరాలు చెప్పలేదు సరికదా ఆ ఫోటోలకు నవ్వుతూ పోజు ఇవ్వడం హాట్ న్యూస్ గా మారింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88786/AMMATHO-NANI-BECOMES-HOT-TOPIC/

No comments