ఆ ముగ్గురు కాంబినేషన్ లో ‘కోబలి’ అదుర్స్..!!

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇద్దరు హీరోలు మాత్రమే నెం.1 స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నారు వారిద్దరే పవర్ స్టార్ పవన్ కళ్యాన్, ప్రిన్స్ మహేష్ బాబు. ఇక దర్శకుల్లో నెం.1 పోటీల్లో ఉన్నది ఎవరా అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి.  మరి ఈ ఇద్దరు హీరోలకు మంచి బ్రెక్ ఇచ్చిన దర్శకుడు కూడా ఈయనే.. మహేష్ కి ‘అతడు’ లాంటి బ్లాక్ బ్లస్టర్ మూవీ, పవన్ కళ్యాన్ కి ‘జల్సా’ అత్తారింటికి దారేది లాంటి సూపర్ డూపర్ హిట్స్ అందించి నెం.1 స్థానాలకు ఇద్దరిని పోటీకి నిలబడే స్థాయికి తీసుకు వచ్చాడు.

తాజాగా పవన్ తో త్రివిక్రమ్ ‘కోబలి’ అనే సినిమా తీస్తున్నాడని అందరికి తెలిసిందే.. ఇందులో మరో ట్విస్ట్ ఎంటంటే ఈ సినిమాకు నిర్మాతగా ఎవరు రాబోతున్నారో తెలుసా..? సూపర్ స్టార్  ప్రిన్స్ మహేష్ బాబు. అయితే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకు  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లోని  పవన్ ‘కోబలి’  సినిమాకు మహేష్   నిర్మాతగా వ్యవహరించడం అంటే ఇండస్ట్రీలో అద్భుతమైన నూతన అధ్యాయం మొదలైనట్లే.. ఈ వార్తతో  ఇటు పవన్ ఫ్యాన్స్, అటు ప్రిన్స్ ఫ్యాన్స్ లో ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

వాస్తవానికి మహేష్ బాబు, పవన్ కళ్యాన్ ల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది బహుషా ఈ విషయం కూడా దానికి ప్లస్ కావచ్చేమో అని అనుకుంటున్నారు. మొత్తానికి ఇదే జరిగితే మటుకు ‘కోబలి’ బ్లాక్ బ్లాస్టర్ అవ్వడం ఖాయమనే  అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/88368/mahesh-pawan-trivikram-kobali-latest-news-tollywoo/

No comments