అబ్బో మహేష్ కొడుకు అదరగొట్టాడు..!!

సూపర్ స్టార్ కృష్ట తెలుగు చిత్ర సీమలో ప్రయోగాల పుట్ట, అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు కుటుంబ కథా చిత్రాలు, పౌరాణిక చిత్రలు, జాన పద చిత్రాలు ఉండేవి, తర్వాత కాలంలో కృష్ణ అడపా దడపా కొన్ని చిత్రాల్లో నటించినా  ‘తెనెమనసులు’ చిత్రం ద్వారా హీరోగా  మంచి గుర్తింపు తెచ్చుకొని  జెమ్స్ బాండ్ , కౌబాయ్ సినిమాలు, డిటెక్టీవ్, ఫైట్లు లాంటివి  పరిచయం చేసి తెలుగు చిత్ర రంగానాకి కొత్త భాష్యం చెప్పాడు. ఈయన తనయుడు మహేష్ బాబు చిన్నప్పుడే సినిమాల్లో మంచి పవర్ ఫుల్ పాత్రలు వేసి ఫైటింగ్, డ్యాన్స్ లాంటి చేసి అబ్బో అనిపించాడు.

తర్వాత మహేష్ రాజకుమారుడు సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి పోకిరి లాంటి సినిమా తీసీ తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించాడు. అయితే మహష్ బాబుకి తన తండ్రి పుట్టిన రోజు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన పుట్టిన రోజుకు ‘శ్రీమంతుడు’ టీజర్ రిలీజ్ చేసి తండ్రికి గిఫ్డు గా ఇచ్చాడు. అంతే కాదు మహేష్ తనయుడు గౌతమ్ తో తన తండ్రికి మరో అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు.


'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో... ఆడే పండుగాడు' అన్న తన సినిమా డైలాగ్‌ని జూనియర్‌ ప్రిన్స్‌ గౌతమ్‌తో చెప్పించారు. ఇప్పుడు ఈ విడియో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది.


source:http://www.apherald.com/Movies/ViewArticle/88334/superstar-krishna-mahesh-babu-goutham-tollywoodmov/

No comments