జూన్ 19న కిక్ 2

రవితేజ-సురేందర్ రెడ్డి లకు మరిచిపోలని హిట్ 'కిక్'. దానికి సీక్వెల్ కిక్ 2. కళ్యాణ్ రామ్ నిర్మాత. ఈ సినిమాపై మంచి అంచనాలే  వున్నాయి. మే లోనే బాలయ్య సినిమాకు అటు ఇటుగా వస్తుంది అనుకున్నారు. కానీ ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా స్లాట్ దొరికేసినట్లే. జూన్ 19న ఫిక్సయిందని తెలుస్తోంది. నిజానికి రుద్రమదేవిని 19నే విడుదల చేయాలనుకున్నారు. కానీ కిక్ 2 వుందని తెలియడంతో 26కువెళ్లారు. 

అయితే 19 ఇప్పటికే వీర బిజీ స్లాట్ గా పేరు తెచ్చుకుంది. మంచు విష్ణు-దేవా కట్టాల డైనమేట్, కొత్త హీరోల టిప్పు, వినవయ్యా రామయ్యా, మరో చిన్న సినిమా లవకుశ అదే రోజు ఫిక్సయ్యాయి. మరి రవితేజ వస్తున్నాడంటే, వీటిలో ఏవి పక్కకు వెళ్తాయో చూడాలి. 
source: http://telugu.greatandhra.com/movies/movie-news/june-19-na-kick-2-62474.html

No comments