జూన్ 26న ‘రుద్రమదేవి’ రిలీజ్
అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్‌లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ద్విభాషా చిత్రం ‘రుద్రమదేవి’. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రాన్ని జూన్ 26న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాత గుణశేఖర్. ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రీ-రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇళయరాజాగారి నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25 రోజులపాటు లండన్‌లో ఈ రీ-రికార్డింగ్ కార్యక్రమాలు జరిగాయి. లండన్‌లో రీ-రికార్డింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ‘రుద్రమదేవి’ కావడం విశేషం. రుద్రమదేవిగా అనుష్క ఎంతో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. కథ పరంగా, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌పరంగా, సాంకేతికపరంగా ఎంతో అత్యున్నతంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. జూన్ 26న ప్రపంచ వ్యాప్తంగా మా ‘రుద్రమదేవి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జూన్ 26న విడుదలవుతోంది. అలాగే మలయాళంలో కూడా జూన్ 26నే ఈ చిత్రం విడుదలవుతుంది’’ అన్నారు. రుద్రమదేవిగా అనుష్క నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, నిత్యమీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్‌కుమార్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, ఆదితి చెంగప్ప, సన, రక్ష తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. source:http://telugu.greatandhra.com/movies/movie-news/june-26-rudramadevi-release-62473.html
Post a Comment