ఆంధ్రుల మనోభావాలను దెబ్బ తీసిన ఆంధ్రా పోరి !
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా త్వరలో విడుదల కాబోతున్న ‘ఆంధ్రాపోరి’ సినిమా విడుదల కాకుండానే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ హైదరాబాద్ లోని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది అని తెలుస్తోంది. ఈ టైటిల్ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఆంధ్రా సెటిలర్స్ ఫోరం కోర్టును ఆశ్రయించింది అని తెలుస్తోంది.
ఈ పిటీషన్ దాఖలు చేసిన వారి అభిప్రాయంలో ఈ సినిమా టైటిల్ మహిళలకు అసభ్యకరమైన భావాన్ని కలిగించేలా ఉంది కాబట్టి ఈ టైటిల్ ను మార్చాలని కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ అయిన ఈ టైటిల్ మార్చాలని తమ పిటీషన్ లో ఆంధ్రా సెటిలర్స్ కోరినట్లు టాక్.
ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరో హీరోయిన్లుగా రూపొందిన 'ఆంధ్రాపోరి' సినిమాకు రాజ్ మాదిరాజ్ దర్శకుడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కథ ప్రతి మనిషి జీవితంలో తొలిప్రేమ ఉంటుంది. మనిషి చనిపోయే వరకు ఆ అనుభవాలు వెంటాడుతూనే ఉంటాయి అనే కథాంశం పై నిర్మించిన సినిమా అని తెలుస్తోంది.
ఈసినిమా పబ్లిసిటీని కూడ చాల విభిన్నంగా చేస్తూ పూరి తన కొడుకు ఆకాష్ ను బుల్లితెర కార్యక్రమాల ద్వారా అందరికీ పరిచయం చేస్తూ ఆకాష్ కు అప్పుడే ఒక స్టార్ ఇమేజ్ ను తీసుకు రావడానికి తన వంతు ప్రయత్నాలను చేస్తున్నాడు పూరి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88445/ANDHRA-PORI-BECOMING-PROBLEM-FOR-ANDHRA-PEOPLE/

Post a Comment