ప్రిన్స్ సెటైర్ తో అలెర్ట్ అయిన మహేష్ బావ !
గడిచిన ఆదివారం విడుదల అయిన ‘శ్రీమంతుడు’ ట్రైలర్ మహేష్ అభిమానులతో పాటు సాధారణ సినిమా అభిమానులకు కూడ బాగా నచ్చడంతో ‘శ్రీమంతుడు’ పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈ ట్రైలర్ చివరిలో మహేష్ కొంతమంది రౌడీలను కొడుతూ ‘దత్తత’ అనే పదాన్ని వాడుతూ ‘ఊరును దత్తత తీసుకోవడం అంటే సొంత డబ్బుతో రంగులు వేసి రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా?’ అంటూ పంచ్ డైలాగ్ వేసాడు మహేష్.
అంతేకాదు ‘మీ అందర్నీ దత్తత తీసుకుంటాను’ అంటూ రౌడీల వంక చూస్తూ బెదిరిస్తాడు. అయితే ఈ డైలాగ్ కొంతమంది రాజకీయ నాయకుల పై సెటైర్ గా ఉందని అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఆమధ్య చాలామంది రాజకీయ నాయకులు సినిమా సెలెబ్రెటీలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నాము అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ లిస్టులో మహేష్ బావ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. ఆమధ్య ఆయన కూడా ఒక ఊరును దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. మరి ఈ ట్రైలర్ లోని సెటైర్ మహేష్ బావకు కూడ వర్తిస్తుందా అంటూ కొందరు ‘శ్రీమంతుడు’ ట్రైలర్ పై కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వార్తలు ఇలా ఉండగా మహేష్ తన ‘శ్రీమంతుడు’ సినిమా విడుదల తేదీని ప్రకటించడమే కాకుండా ప్రభాస్ ‘బాహుబలి’ కి ఎదురు నిలుస్తూ ఉండటంతో నిజంగానే మహేష్ రాజమౌళి ‘బాహుబలి’ విడుదల అయిన వారం రోజులకు ‘శ్రీమంతుడు’ గా వచ్చి పోటీగా నిలబడగలుగుతాడా అనే సందేహం చాలామంది బయ్యర్లలలో ఉంది అని టాక్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88443/PRINCE-SATIRE-BECOMINGALERT-TO-MAHESH-BROTHER-IN-LAW/

Post a Comment