మీరు బ్లూ ఫిల్మ్‌లు చూశారా అంటూ సీఎం ప్రశ్న.. ఆయనకు సిగ్గుందా అంటున్న ప్రజలు


రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చాలా కామన్‌. కాని ఆ విమర్శలు అనేవి కాస్త హద్దుల్లో ఉంటే మంచిది. హద్దుల్లో లేని విమర్శల వల్ల అనర్థాలు రావడం ఖాయం అని కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు అర్థం అయ్యింది. బీజేపీ నాయకులను విమర్శిస్తున్న సమయంలో మీరు బ్లూ ఫిల్మ్‌లు ఎప్పుడైనా చూశారా? అసలు మీకు బ్లూ ఫిల్మ్‌లు అంటే ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించాడు. మీకు బ్లూ ఫిల్మ్‌లు చూసే నాయకులు అవసరమా, అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానం. అలాంటి దేవాలయంలో బ్లూ ఫిల్మ్‌లు చూసిన వారిని మీరు వెంటనే తరిమి కొట్టాలని సీఎం సిద్ద రామయ్య అన్నాడు.


కొన్నాళ్ల క్రితం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బ్లూ ఫిల్మ్‌లు చూస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడి పోయారు. దాంతో వారిని ఇలా సీఎం సిద్ద రామయ్య సమయం వచ్చినప్పుడల్లా ఏకి పారేస్తున్నాడు. ఈసారి ప్రజలను మద్యకు తీసుకు వచ్చి మీకు బ్లూ ఫిల్మ్‌లు తెలుసా అంటూ ప్రశ్నించాడు. ఒక ఉన్నత స్థాయి అయిన పదవిలో ఉండి సిద్ద రామయ్య అలా మాట్లాడటం ఇప్పుడు విమర్శలకు తావు ఇస్తుంది.


సీఎం సిద్ద రామయ్య గతంలో కూడా పలు సార్లు వివాదాస్పదం అయ్యాడు. ఎన్ని సార్లు సోషల్‌ మీడియాలో ఆయనపై విమర్శలు వచ్చినా కూడా ఆయన తీరు మారడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది. మరో సంవత్సరంలో ఎన్నికలున్నాయి. దాంతో బీజేపీ వారిపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసి, వారిని ప్రజల్లో చులకన చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం ఆ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు కాస్త ఆయనకే చుట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో సిద్ద రామయ్య మళ్లీ గెలవడం దాదాపు అసాధ్యం అంటూ సర్వేలు చెబుతున్నాయి. ఇలా చెత్త వ్యాఖ్యలు చేస్తే మళ్లీ ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు చెప్పండి. 

No comments