చిరంజీవి ఎవరో నాకు తెలియదు.. నేనే నెం.1 అన్న టాప్ హీరో
జూనియర్ నందమూరి తారక రామారావు ఈయన్ను చాలా మంది బుడ్డోడు అని జూనియర్ ఎన్టీఆర్ అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం ఒక్కటే.. గొప్ప నటులైన సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆ వంశం నుంచి బాలయ్య మాత్రమే హీరోగా రాణించారు. కానీ, హరికృష్ణ నుంచి అందరూ అప్పుడప్పుడు ఒకటి అరా చిత్రాలతోనే ఆకట్టుకున్నారు. ఇకా, సీనియర్ ఎన్టీఆర్ భాష, ఉచ్చారణ, గాంభీర్యం, వాగ్ధాటి అమోగం. కానీ బాలకృష్ణకి కూడా సరిగ్గా ప్రసంగాలు చేయడం రాదూ, మాటలు తడబడుతూ ఉంటాయి. ఏదో చెప్పాలని భావిస్తూ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. అయన ఇచ్చే స్పీచ్ లు.. ఆయన వీరాభిమానులకు మెచ్చుకోలేరు. ఆయన తండ్రిలాగా అనర్గళంగా మాట్లాడడం చేతకాదు. సినిమాలో రాసిచ్చిన డైలాగ్స్ అయితే రికార్డింగ్ థియేట్లలలో చాలా పవర్ ఫుల్ గా చెప్తూ ఉంటాడు. ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ కోసమే థియేట్లలకు మరల మరల వచ్చి సినిమాలను చూసే వీరాభిమానులు ఉన్నారు. కానీ ఆయన బహిరంగ వేదికలలో కనీసం ప్రెస్ మీట్ లో కూడా తడుమువుకుండా మాట్లాడలేరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు.తన తాత పోలికలనే కాదు, ఆయన వాగ్ధాటిని, ఆయనలోని కొన్ని సుగుణాలను జూనియర్ పుట్టుకతోనే వరంగా పొందాడు.
ఇకా చిన్న వయస్సులోనే బాల రామాయణంలో రామునిగా మెప్పించాడు. మొదటి సినిమాతో కాకపోయినా స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి వంటి చిత్రాలతో అదరగొట్టాడు. దాంతో చాలా మంది పాత ఎన్టీఆర్ ను మరల చుస్తున్నామా అన్న ఆనందంలో జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు. ఇకా ఆయన పొడవు చాలా తక్కువ. వయస్సు కూడా చాలా తక్కువ కావడంతో బుడ్డోడు.. గట్టోడు మొత్తానికి తాతలా సింహంలా పుట్టాడు అనే ఆనందంలో ఆయన్ను కొందరు సీనియర్స్ బుడ్డోడు.. బుడ్డోడు అని పిలుస్తారు. కానీ ఈ చిన్న ఎన్టీఆర్ కి మాత్రం తనని బుడ్డోడు లేదా జూనియర్ ఎన్టీఆర్ అని పిలిస్తే తెగ కోపం వస్తుంది. ఒకానొక సమయంలో అది తరువాత చేసిన ఇంటర్వ్యూలో మిమల్ని జూనియర్ ఎన్టీఆర్ అని పిలిస్తే మీకు కోపం ఎందుకు? అదేమి భూతు మాట కాదు కదా అని ప్రశ్నించినప్పుడు ఆయన వీర ఆవేశంతో జూనియర్ అని పిలిస్తే కొడతా.. తాతలనే నన్ను కూడా ఎన్టీఆర్ అని పిలవమని సమాధానం చెప్పాడు. ఆ తరువాత మహానుభావుడైన, స్వర్గీయుడైన ఎన్టీఆర్ అని పిలిచి ఇంకా రెండు పదుల వయస్సు కూడా నిండని కేవలం రెండు, మూడు హిట్స్ ఉన్న మిమల్ని కూడా ఎన్టీఆర్ అని పిలవడం ఎంత వరకు సమంజసం. మీకు అలా అనిపించుకోవాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్. మీరు ఇప్పుడు మీ తాతకు సమానులని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన నుండి సమాధానం లేదు. ఇకా చిన్న వయ్స్సులోనే సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అప్పుడే విజయాన్ని తలెకెక్కించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఎందరో సీనియర్ లను అవమానించేవాడు. తాను కూర్చుని వాళ్ళను నిలబెట్టి మాట్లాడేవాడు. వీరిలో ఆయన తాతతో, బాబాయితో చిత్రాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులైన సీనియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ తాతల కాలంనాటి జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు కూడా ఉండేవాడు. కానీ ఆయన ఎవ్వరికి గౌరవం ఇచ్చేవాడు కాదు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తాను నటించిన శాస్త్రీయ నృత్యాలను పలు ఊర్లలో, చిన్న చిన్న దేవాలయాలలో జరిగే దసరా, వినాయకచవితి వేడుకలలో ప్రదర్శించేవాడు.
అయితే, ఆయనలోని ప్రతిభను నాటి సీనియర్ నిర్మాత, దర్శకుడు వాళ్ళ తాతతో కూడా పలు సినిమాలు నిర్మించిన సహజకవి, మల్లెమాల సుందర రామి రెడ్డి ఆయన్ను బాల రామాయణం వంటి చిత్రంతో ప్రధాన పాత్ర ఇవ్వడమే కాదు.. ఆ సినిమా విడుదలకు ముందే పిల్లోడు పెద్దవాడైన తరువాత పెద్ద మాస్ హీరో కావడం ఖాయమని ప్రెస్ మీట్ లో కూడా చెప్పి ప్రశంసించేవాడు. తనని కలసిన అందరికి ఈ పిల్లోడు సామాన్యుడు కాదయ్యా.. వీడు వజ్రంలాంటోడు అని పొగిడేవాడు. వాస్తవానికి స్వర్గీయ మల్లెమాల అని పిలుచుకునే ఎమ్.ఎస్ రెడ్డి ఎవ్వరిని అనవసరంగా పొగడడు. ఏ విషయానైనా తప్పు కనిపిస్తే చాలు ఎంత పెద్ద హీరోనైనా కడిగిపారేస్తారు. అలాంటి వ్యక్తి కూడా జూనియర్ ఆనాడు గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడడం సహించలేక ఇకా నేను అతన్ని కలవను.. అంత పొగరా అని పలువురితో ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు మిత్రులు ఆయన్ను సార్ మీరు తీసిన బాల రామాయణం పేరు అవార్డులు, ఎంతో మంది బాలనటులకు జీవితం ఇచ్చింది కానీ మీకు ఆర్ధికంగా నష్టాలనే మిగిల్చింది కదా. అలానే మీరు తీసిన అందం చిత్రం విడుదలకు కూడా నోచుకోకుండా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు కదా. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయనతో ఓ సినిమా నిర్మిస్తే మీకు ఆర్ధికంగా చేయూత అవుతుంది కదా అని సలహా ఇస్తే.. ఆపండి డబ్బులు లేకపోతే చనిపోతాను కానీ.. నేను కానీ నా కుమారుడు శ్యాం ప్రసాద్ రెడ్డి కానీ ఎన్టీఆర్ కాల్ షీట్స్ అడగం.. బ్రతిమిలాడే పరిస్థితి నాకు లేదు. నాలుగు దెబ్బలు తింటే సినిమా ఫీల్డ్ అనేది ఆ బుడ్డోడికి తెలిసొస్తుంది అని ఆవేశంగా ఆవేదన వ్యక్తం చేశాడు. అన్న మాట ప్రకారమే తనువు చాలించారు.
ఇకా జూనియర్ విషయానికి వస్తే ఆది, సింహాద్రి అనే రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చి డాన్సులు కూడా చిరంజీవి కంటే బాగానే చేస్తున్నాడు అని పలువురు ప్రోత్సహించారు. కానీ, ఆ మాటలను విని గర్వంగా ఫీల్ అయిన జూనియర్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తరువాత మీరే డాన్సులు బాగా వేస్తున్నాడు అంటే ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. చిరంజీవి ఎవరు నాకు తేలియాదే ఆయన హీరోనా.. అలాంటి వాళ్ళు ఎవ్వరు నాకు తెలిసిలేరే టాలీవుడ్ నేనే నెంబర్ వన్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను ఎంత దూరంలో ఉన్నపటికీ తన మీద అభిమానంతో ఒక్కసారి కలవాలని.. ఫొటోస్ దిగాలని ఫాన్స్ వస్తే సమయం.. అవకాశం.. అన్ని ఉన్న ఫోటోలు దిగేవాడు కాదు. నోటికొచ్చినట్లు తిట్టేవాడు. కానీ ఆ తరువాత వచ్చిన పరాజయాలు, వివాహం తరువాత మార్పుల వల్ల ఆయన తను మారాను అంటున్నాడు. ఈ మధ్య ఎంత షూటింగ్ బిజీలో ఉన్న ఫాన్స్ వస్తే వారితో మాట్లాడి ఫోటోలు కూడా దిగుతున్నాడు. అది నిజమే. ఇది ఇండస్ట్రీలో తెలిసిన పచ్చి నిజం.source:telegumessenger
Post a Comment