షాక్‌ : నగ్న సీన్స్‌ మేకింగ్‌ను విడుదల చేసిన సంజన


కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రం దండుపాళ్యం 2 చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో సంజన నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక సీన్‌లో పూర్తి న్యూడ్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సీన్‌ సెన్సార్‌ కట్స్‌కు గురైంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ సీన్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.
సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆ న్యూడ్‌ వీడియో షాక్‌ను కలిగిస్తుంది. ఒక సౌత్‌ హీరోయిన్‌ ఈ స్థాయిలో న్యూడ్‌గా నటించడం అందరిని ఆశ్చర్యపర్చింది. సంజన అసలు ఇలా ఎలా నటించింది అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.

మరి కొందరు మాత్రం ఆ సీన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. న్యూడ్‌ సీన్స్‌ ఏమాత్రం సమర్థనీయం కావు అని, సంజన చేసింది తప్పు అంటూ ఆడిపోసుకున్నారు. సంజనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విషయాన్ని సంజన బయట పెట్టింది.
న్యూడ్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో తాను న్యూడ్‌గా లేను అని, అది గ్రాఫిక్స్‌ ట్రిక్‌ అంటూ చెప్పుకొచ్చింది. మేకింగ్‌ ఫొటోను విడుదల చేసి అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. సంజన తనపై వస్తున్న విమర్శలకు ఇలా సమాధానం ఇచ్చింది. దాంతో సంజనపై వస్తున్న విమర్శలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది. న్యూడ్‌ సీన్స్‌ ఇలా తీస్తారు అంటూ సంజన చెప్పడంతో గతంలో వచ్చిన న్యూడ్‌ సీన్స్‌ గురించి ప్రేక్షకులు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డారు. 

No comments