జనసేన ఎంపీ అభ్యర్థిగా రోజా..!
ప్రముఖ సినీనటి, వైసీపీ ఫైర్‌బ్రాండ్, చిత్తూరు నగరి ఎమ్మెల్యే రోజా రాజకీయంగా మరో సంచలన నిర్ణయానికి రెడీ అవుతున్నారా ? వైసీపీలో రోజు రోజుకు తగ్గుతున్న ప్రయారిటీ, సీనియర్లు జగన్‌కు తనపై లేనిపోని చాడీలు చెప్పడం లాంటి అంశాలతో ఆవేదనతో ఉన్న ఆమె ఆ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చారా ? అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలోను, ఏపీ రాజకీయ వర్గాల్లోను అవుననే ఆన్సరే వినిపిస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన రోజా ఆ పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీ తరపున ఆమె నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఆమె జగన్ మీద ఈగ కూడా వాలనిచ్చే వారు కాదు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు పప్పు అనే నిక్‌నేమ్‌ను ఆమే బాగా హైలెట్ చేశారు.
రోజా మీడియాలోను, అసెంబ్లీలోను హైలెట్ అవ్వడం పార్టీలోనే సీనియర్లకు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆమెను కంట్రోల్ చేయాలని వాళ్లంతా జగన్‌కు పదే పదే కంప్లైంట్లు చేశారు. ఇక తాజాగా ప్రశాంత్ కిషోర్ సైతం తన నివేదికలో రోజా భాష, ఆమె తీరు పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం పెరుగుతోందని, ఆమెను కంట్రోల్ చేయకపోతే పార్టీకే నష్టమని పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైసీపీలో అవమానాలు తట్టుకోలేకపోతోన్న ఆమె జనసేన వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు సైతం ఆ పార్టీలో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని టాక్. ఈ క్రమంలోనే నాగబాబు – రోజా జబర్దస్త్ సన్నిహితులు. ఈ క్రమంలోనే రోజాకు వైసీపీలో జరుగుతోన్న అవమానాలు తెలుసుకున్న నాగబాబు ఆమెను జనసేనలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
రోజా జనసేనలో చేరితే ఆమెకు సీమలో ఎక్కడో ఓ చోట ఎంపీ సీటు ఇస్తామని కూడా నాగబాబు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. పవన్ అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె అదే జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తే అక్కడ జనసేనకు మరింత ఊపు రావడం ఖాయమని జనసేన భావిస్తోంది. అయితే ఆమెకు ఏ ఎంపీ సీటు ఇచ్చేది ఇంకా క్లారిటీ అయితే లేదని తెలుస్తోంది. మరి ఈ ప్రతిపాదనకు ఆమె ఎంత వరకు ఓకే చెపుతుందో ? అన్నది కూడా చూడాలి
Post a Comment