సుచీ లీక్స్ పార్ట్ 2 రిలీజైంది. నెట్‌లో హల్ చల్ చేస్తున్న త్రిష, ఆండ్రియాల వీడియోలు..!
సుచీలీక్స్… ఒకప్పుడు ఈ విషయం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. సింగర్ సుచిత్ర తనను నటులు ధనుష్, శింబులతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వేధించారని చెబుతూ వారికి చెందినవిగా భావిస్తున్న కొన్ని వీడియోలను విడుదల చేసింది. దీంతో ట్విట్టర్‌లో రచ్చ రచ్చ అయింది. అయితే ఓ దశలో ఆమె తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని, కావాలని ఆ వీడియోలను పెడుతున్నారని కూడా చెప్పింది. ఆ తరువాత ఆమె ట్విట్టర్ అకౌంట్ సడెన్‌గా మాయమైంది. అప్పటికి ఇక సుచీ లీక్స్ కథ ముగిసిందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు మరో సారి సుచీ లీక్స్ అంశం తెర పైకి వచ్చింది. తాజాగా సుచీ లీక్స్ పార్ట్ 2 పేరిట నెట్‌లో రెండు వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో ఒకటి త్రిషది కాగా, రెండో వీడియో ఆండ్రియాకు చెందినదిగా భావిస్తున్నారు. ఆయా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా సింగర్ సుచిత్రనే ఇలా చేసిందా, లేక ఆమె పేరిట ఈ పార్ట్ 2కు ఎవరైనా తెర తీశారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పట్లో ఈ సుచీ లీక్స్ భూతం సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని వదిలేలా లేదు. ఈ క్రమంలో ఇకపై ఎన్ని సుచీ లీక్స్ వీడియోలు వస్తాయో వేచి చూడాలి..!
Post a Comment