మీ తలరాతని మీరే చదవచ్చు..! ఎలానో తెలుసుకోండి..!
మన జీవితంలో ఏది జరగాలో... ఏది జరగకూడదో.. ముందుగానే బ్రహ్మ దేవుడు రచిస్తాడని హిందువులంతా నమ్ముతారు. అందుకే... మన జీవితంలో మంచి జరిగితే తలచుకొని బ్రహ్మదేవుడ్ని.. చెడు జరిగితే తప్పక తల్చుకుంటాం. అంతా ఆ బ్రహ్మ దేవుడే రాశాడు అని బాధపడిపోతారు. పైగా బ్రహ్మ దేవుడ్ని తలచుకునేది ఈ ఒక్క విషయంలోనే. బ్రహ్మ రాసే రాత మనకు కనిపించదని అందరికి తెలిసిందే... కానీ తలరాతను కూడా చదవొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇది నిజమే అయితే... తలరాతను ఎలా చదవాలి? దానిని బట్టి ఎవరు ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? అనేది ఇప్పుడు చూద్దాం...!!
తలరాత ను తెలుసుకోవాలంటే ఇలా చేయాలి:
ముందుగా నుదుటి పై కాస్త ఆయిల్ రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. ఆ తర్వాత అద్దం ముందు నిలబడి కనుబొమ్మలను పైకి కిందకు అనే సమయంలో ఏర్పడ్డ గీతలను లెక్కపెట్టండి. అవి ఎలా ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, ఒకదానికొకటి తాకుతున్నాయా లేదా.. అనేది గమనిస్తే వాటి ఆధారంగా మీ ఆరోగ్యాన్నీ, జీవించే వయస్సును తెలుసుకోవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం...!!
- నుదుటిపై ఎటువంటి గీతలు లేకపోతే వీళ్లు 45 నుంచి 50 ఏళ్ల వరకు జీవిస్తారు. అలాగే వీరు జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు.
- నుదుటిపై ఐదు గీతలుండి, అనేక అతుకులు ఉంటే వారు అల్పాయుష్కులు. అకారణంగా చనిపోతారు.
- నుదుటిపై గీతలు ఒకదానికొకటి తాకుతుంటే... 60 ఏళ్ల వరకు జీవిస్తారు. అంతే కాకుండా అంటువ్యాధులు, చర్మవ్యాధుల బారిన పడతారు.
- నుదుటిపై నల్లటి, లోతైన గీతలుంటే.. 60 నుంచి 65 ఏళ్లు జీవిస్తారు. మంచి ధనవంతులు అయి ఉంటారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు.
- నుదుటిపై మూడు బలమైన గీతలుంటే... 75 నుండి 85 ఏళ్ల వరకు జీవిస్తారు. ప్రశాంత జీవనం గడుపుతారు.
- నుదుటిపై అయిదు గీతలుండి ఒకదానికి మరొక దానికి పోలిక లేకుంటే.. పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా వంద ఏళ్లు బ్రతుకుతారట.
Post a Comment