స్త్రీలు ఎందుకు రెగ్యూలర్ గా హస్తప్రయోగం చేసుకోవాలి?


హస్తప్రయోగం అనగానే అది కేవలం మగవారి అలవాటు అనుకుంటారు చాలామంది. అది ఒక అపోహ మాత్రమే అని ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం. మగవారికి ఉన్నట్లే మహిళలకి హస్తప్రయోగం అలవాటు ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే స్త్రీ శరీరానికి హస్తప్రయోగం చాలా లాభదాయకం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి దొరికిన గొప్ప వరమే హస్తప్రయోగం. దీన్ని మతవాదులు విభేదించినా, ఒకరి ఇబ్బంది పెట్టకుండా చేసుకునే వ్యక్తిగత వ్యవహారం కాబట్టి, హాస్తప్రయోగం చేసుకోండి మహిళల్లారా. ఎందుకంటే !

* పీరియడ్స్ లో వచ్చే క్రాంప్స్, నొప్పులని సునాయాసంగా తగ్గించే మమార్గం హస్తప్రయోగం. ఇందులో ఎలాంటి ప్రమాదం కాని, తమని తాము చిన్నచూపు చూసుకోవడానికి అవకాశం కాని లేదు. ఓరకంగా చెప్పాలంటే, పీరియడ్స్ లో వచ్చే నొప్పులనుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి ఇచ్చిన వరం అనుకోండి.

* భావప్రాప్తి పొందినప్పుడు కార్విక్స్ ఒపెన్ అయి, యోనిలో ఉండిపోయిన బ్యాక్టీరియా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఇంఫెక్షన్ల బెడద చాలావరకు తగ్గుతుంది. మరి ఇంఫెక్షన్లని తగ్గిస్తుంది అంటే హస్తప్రయోగం చెడ్డ అలావాటు ఎలా అవుతుంది. అందుకే హస్తప్రయోగం చేయాలి మహిళలు.

* భావప్రాప్తి అంత హాయిగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ సమయంలో మానసిక, శారీరక ఆనందాన్ని ఇచ్చే ఆక్సోటోసిన్, డోపమైన్ లాంటి హార్మోన్లు విడుదల అవడం వలన. కాబట్టి, హస్తప్రయోగం మూడ్ ని మార్చే సాధనం. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన ప్రతీసారి హస్తప్రయోగం ఉపయోగపడుతుంది.

* ఒక్కోసారి సెక్స్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. దానికి చాలా కారణాలుంటాయి. కొన్నిసార్లు భాగస్వామికి భావప్రాప్తి దొరికినా, స్త్రీకి భావప్రాప్తి దొరక్కపోవచ్చు. అలాంటి సమయాల్లో, భావప్రాప్తి కోసం సొంత చేతుల మీద ఆధారపడితేనే మేలు కదా.

* సెక్సువల్ డిప్రెషన్ అనేది నేటి యువతలో కనిపిస్తున్న అతి ముఖ్యమైన మానసిక సమస్యల్లో ఒకటి. తమకి ఓ తోడు లేదని, తీరని కోరికలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి హస్తప్రయోగం చిన్నిపాటి ఉపశమనం.

* ప్రశాంతమైన నిద్రకి హస్తప్రయోగం మంచి మందు లాంటిది అని చెబుతారు డాక్టర్లు. ముందుగా చెప్పినట్లు, హస్తప్రయోగం హాయిని, ప్రశాంతతని అందించే హార్మోన్లని విడుదల చేస్తుంది. కాబట్టి హాస్తప్రయోగం వలన ప్రశాంతమైన నిద్ర, చాలా తేలికగా పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే అమ్మాయిలకి ఇదో మెడిసిన్.

No comments