శృంగారంలో ఆ భంగిమల జోలికి వెళ్లొద్దు


ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో సెక్స్ చాలా ముఖ్యం. సుఖ‌మ‌య శృంగారంతో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవ‌చ్చ‌నే చాలా విష‌యాల‌ను వింటూనే ఉంటాం. శృంగారంలో చాలా భంగిమ‌ల్లో తృప్తి పొంద‌వ‌చ్చు. అయితే కొన్ని భంగిమ‌ల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది అంటున్నారు సెక్స్ నిపుణులు. అవేంటో ఓ సారి చూస్తే… మ‌హిళ మ‌గాడిపైన కూర్చునే స్థితిలో సెక్స్‌లో పాల్గొన‌డం వ‌ల్ల పురుషాంగానికి ప్రమాదం ఉంటుందనీ, దెబ్బతినే అవకాశం ఉందని, ఒక్కొక్క‌సారి ప‌క్క‌కు స్లిప్పయి సున్నిత ప్ర‌దేశంలో గాయమ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని చెపుతున్నారు.

పురుషుడి పైన కూర్చున్న భంగిమలో స్త్రీ సెక్స్ చేసేటపుడు అతడి వ్యక్తిగత ప్రదేశంపైనే బరువంతా పడుతుంది. అందువల్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం… స్త్రీ, పురుషునిపైన కూర్చున్న భంగిమలో సెక్సులో పాల్గొంటే 50 శాతం పురుషాంగ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. అలా గాయ‌మైన వారికి సున్నిత ప్ర‌దేశం కావ‌డంతో ఆ గాయం త‌గ్గేందుకు చాలా రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని నిపుణుల అభిప్రాయం.
అదేవిధంగా స్త్రీ డాగా స్టయిల్లో… అంటే రెండు చేతులు, రెండు కాళ్లపై బరువు ఉంచి పురుషుడి పైకొచ్చి చేసే సెక్స్ వల్ల 29 శాతం గాయాలయ్యే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక పురుషుడు పైన స్త్రీ కింద ఉండే భంగిమలో అతి తక్కువగా 20 శాతం గాయాలు అయ్యే అవకాశం ఉందని తేలింది. అయితే ఇవన్నీ చాలా అరుదుగా జరుగుతుంటాయని కూడా తెలిపారు. సెక్సులో పాల్గొనేవారు మరీ మొరటుగా వ్యవహరించినప్పుడు మాత్ర‌మే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు సెక్స్ నిపుణులు తెలుపుతున్నారు.

No comments