శనిని ప్రసన్నం చేసుకోండిలా!
పిల్లలు చేసే పనులకు ఒక్కోసారి చాలాకోపం వస్తుంది. వాళ్లని గట్టిగా దండించాలి అనిపిస్తుంది. కానీ వారు సారీ చెప్పి ప్లీజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మందలింపుతో సరిపెడతాం. ఎవరినైనా తిడితే ఏం చేస్తారు? మొహం పగలకొడతారు. అదే పొగిడితే. వారి గొప్పదనాన్ని కీర్తిస్తే నీకు మేలు చేస్తారు లేదా సంతోషిస్తారు. నీ పట్ల సహృదయంతో ఉంటారు. భగవంతుడు విషయంలో కూడా అంతే.
2017 జనవరి 26 తర్వాత శనిసంచారం మారింది. ఫలితంగా శని ప్రతికూలంగా ఉన్న వారు వీటిల్లో ఏవి వీలైతే వాటిని పాటించి ప్రసన్నం చేసుకోవచ్చు. ఇవి మీరు పాటిస్తే వాటి ఫలితాన్ని వెంటనే గుర్తిస్తారు.
1.శనికి తైలాభిషేకం
2.మీ గోత్రనామాలతో శనిజపం చేయించడం
3.నల్ల ఆవుకు ఎండు, పచ్చగడ్డి
4.కుక్కలకు చపాతీలో/రోటీలు నువ్వుల నూనెతో చేసి పెట్టాలి
5.కాలభైరవస్తోత్ర పఠనం
6.హనుమాన్‌చాలీసా, ఆంజనేయస్వామికి మంగళ/శనివారాల్లో 40 ప్రదక్షిణలు
7.హనుమాన్ గుడిలో ప్రసాదం స్పాన్సర్ చేయడం
8.శని వికలాంగుడు. తల్లి ప్రేమ తప్ప తండ్రి ప్రేమ సరిగ్గా నోచని వాడు కనుక వికలాంగులకు, వృద్ధులకు, అనాధలకు మేలు చేసే పని చేయడం.
9.పులిహోర ఇంట్లో వండించి రుచి చూడకుండా ప్యాకెట్లు కట్టి వీలైనంతమందికి ఇవ్వడం.
శనైశ్చరుడు చాలా గొప్ప వాడు. కర్మ ఫలదాత. ఆయన అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకుందాం. నల్లని, నీలి వస్త్రాలు ధరించాలి. కొందరు ధరించకూడదు అనుకుంటారు. అది తప్పు
Post a Comment