చేతబడి గురించి అసలైన రహస్యాలు ఇవే
చేతబడి..!! ఇది ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువగా చెప్పేమాట. ఆ కాలంలో చేతబడి అనేది ఎక్కువగా వినిపించేది. వాళ్లు ప్రత్యక్షంగా చూశామని.. చేతబడికి గురయైనవాళ్లను, చేతబడి చేయించేవాళ్లను గుర్తించామని చెబుతుండేవారు. అయితే ఇవన్నీ నమ్మసక్యమేనా ? నిజంగానే చేతబడి ఫలిస్తుందా ? అది సాధ్యమేనా ? చేతబడితో ఓ వ్యక్తిని పూర్తీగా మార్చేయవచ్చా ? చేతబడి ఓ వ్యక్తి జీవితాన్నే అఘాతంలోకి తొక్కేస్తుందా ? అనేది నేటితరాన్ని వేధించే సందేహాలు.
అర్థరాత్రిళ్లు మంత్రతంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ.. ఆవాహయామీ అంటూ.. జపిస్తూ.. రహస్యంగా పెద్ద పెద్ద హోమాలు చేస్తూ.. ఈ తంతుకి స్మశానాన్నే వేధికగా చేసుకోవడాన్ని చేతబడిగా భావిస్తారు. తమకు గిట్టని వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి చేసే తంత్రాలను చేతబడిగా చెబుతారు. ఇవన్నీ సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. తమ శత్రువులకు హాని జరగాలని, వాళ్లను ఈ లోకం నుంచి పంపించేయాలనే దురాలోచనతో చేసేది ఈ క్షుద్రపూజలు.
PAGES:
1 2 3 4 5 6
Post a Comment