వశీకరణ (హిప్నాటిజం) లోని రహస్యాలు


ఒక వ్యక్తిని తమ చెప్పు చేతల్లోకి తీసుకోవడానికి ఉపయోగించే విద్య వశీకరణం. దీన్ని పూర్వకాలం ఎక్కువగా నమ్మేవాళ్లు. మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాం.. మాటలు, మంత్రాలతో.. తమకు కావాల్సిన, అవసరమైన వ్యక్తిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఈ వశీకరణ విద్యను, మంత్రాలను ప్రయోగిస్తూ ఉంటారు.

వశీకరణాన్నే ఇంగ్లీష్ లో హిప్నాటిజం అని పిలుస్తారు. మీకు గుర్తుందా.. రఘుబాబు తీసిన సినిమాలో హిప్నాటిజంతో.. మనుషులందరినీ.. తనవైపుకి తిప్పుకుంటాడు. అలాగే.. తనకు కావాల్సిన పనులు పూర్తిచేసుకోవడానికి చేతికి మట్టి అంటుకోకుండా.. ఇతరుల ద్వారా చేయిస్తాడు. దీన్నే వశీకరణం అంటారు.

ఎక్కువ సందర్భాల్లో వశీకరణ విద్యను ప్రేమ, జీవితం, వర్క్ సమస్యలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. తమకు కావాల్సినట్టు, తమకు అనుకూలంగా ఉండేలా పని పూర్తిచేసుకోవడానికి ఈ వశీకరణ మంత్రాలు సహాయపడతాయి. అయితే ఇదంతా నిజమేనా ? వశీకరణం ఈ మోడ్రన్ యుగంలో పనిచేస్తుందా ? వశీకరణ మంత్రాలు నిజంగా పనిచేస్తాయా ? లెట్స్ టేక్ ఎ లుక్....

వశీకరణం సహాయపడుతుందా ? 
చాలా ఏళ్ల క్రితం నుంచి ఇండియా వశీకరణంను ఉపయోగిస్తోంది. తమకు కావాల్సిన పనులను, కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ వశీకరణ విద్యను ఉపయోగిస్తున్నారు.

ప్రేమ, జీవితం కోసం పురాతన భారతదేశంలో.. వశీకరణాన్ని శక్తివంతమైన ఆచారంగా భావించేవాళ్లు. అందుకే జీవితంలో, ప్రేమలో, వర్క్ లో ఎలాంటి సమస్య వచ్చినా.. వశీకరణ ద్వారా పరిష్కరించుకునేవాళ్లు.

చేతబడికి, వశీకరణకి తేడా ఉందా ? చేతబడిలో మీకు కావాల్సిన వ్యక్తిని ఆధీనంలోకి తీసుకోవడానికి కొన్ని మంత్రాలు ఉపయోగిస్తారు. అయితే వశీకరణలో నాలుగు పద్ధతుల ద్వారా ఒక వ్యక్తిని ట్రాప్ చేస్తారు. వక్క, పువ్వు, క్లాత్, లవంగం ఉపయోగించి ఈ ఆచారాన్ని పాటిస్తారు.

వశీకరణ పూజ వశీకరణ పూజను మంత్ర, తంత్రాలతో తాండ్రికుడు నిర్వహిస్తాడు. ఈ మంత్రాల ద్వారా ఒక వ్యక్తిని తమ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.

                                             
PAGES: 1    2    3    4

No comments