చెల్లి పెళ్లి చెయ్యలేక ఏ అన్నయ్య చెయ్యని పని చేసాడు
మానవ సంబంధాలు మరీ దారుణంగా తయారు అవుతున్నాయి. డబ్బులనే చూస్తున్నారు తప్ప మన, తర బేధాలను పట్టించుకోవడం లేదు. సొంత వారిని కూడా డబ్బు కోసం దూరం పెడుతున్న సంఘటనలు చూస్తున్నాం. అయితే తాజాగా దేశ రాజధానిలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన జరిగింది. చెల్లికి పెళ్లి చేయాల్సి వస్తుందని, ఆమెకు కట్నం రూపంలో భారీగా డబ్బు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో ఒక అన్న ఆమె ప్రాణాలు తీశాడు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారం మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి.
హస్నాపూర్‌లోని మధువిహార్‌కు చెందిన ఒక కుటుంబంలో ఈ సంఘటన జరిగింది. ఆ కుటుంబంకు చెందిన పెద్ద 2008వ సంవత్సరంలో మరణించాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్యకు కొడుకు తపస్ కాగా, మరో భార్యకు కూతురు. కుటుంబ బాధ్యతను కొడుకు భరిస్తున్నాడు. ఇదే సమయంలో కూతురు పెళ్లి వయస్సుకు వచ్చింది. ఆమె పెళ్లి చేయాల్సిందిగా ఆ యువతి తల్లి కోరడం మొదలు పెట్టింది.
దాంతో ఆలోచనల్లో పడ్డ తపస్ భారం మోడయం కన్నా చెల్లిని చంపేయడం ఉత్తమం అని భావించాడు. అనుకున్నట్లుగానే చెల్లి మెడకు చున్నితో ఉరి వేసి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తపస్ చంపినట్లుగా అనుమానం వచ్చి విచారించగా, అసు విషయం బయటకు వచ్చింది. ఇలాంటి అన్నలు ఉన్న ఈ సమాజంలో ముందు ముందు మరెన్ని సంఘటనలు చూడాల్సి వస్తుందో అని భయం వేస్తుంది.
Post a Comment