రిలీజ్ కి ముందే బాహుబలి2 '10' నిమిషాల వీడియో
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి2. బాహుబలి మొదటి పార్ట్ దాదాపు 600కోట్ల రూపాయల కలెన్షన్స్ ని కలెక్ట్ చేసింది. ఇక బాహుబలి2 చిత్రం 1000 కోట్ల రూపాయల టార్గెట్ చేసుకొని వస్తుంది. అయితే బాహుబలి మూవీ రిలీజ్ కి ముందే దాదాపు పది నిముషాల విఎఫ్ ఎక్స్ వీడియో బయటకు వచ్చింది. అయినప్పటికీ ఈ ఎఫెక్ట్ రిలీజ్ తరువాత బాహుబలిపై ఏ మాత్రం పడలేదు.
ఆ విధంగా బాహుబలి2 కీ విఎఫ్ ఎక్స్ కి సంబంధించిన అయిదు నిముషాల వీడియో బయటకు వచ్చిన సంగంతి తెలిసిందే. అయితే ఇవన్నీ అన్ అఫిషయల్ గా వచ్చినవే. కానీ ఇప్పుడు అఫిషియల్ గా బాహుబలి2 మూవీకి సంబంధించిన 10 నిముషాల వీడియో బయటకు రానుంది. అదీనూ రాజమౌళి స్వయంగా రిలీజ్ చేయనున్నారు. ఈ వీడియో రిలీజ్ కి ముందే బయటకు రానుంది. ఈ మధ్య కాలంలో పలు చిత్రాలు వారి మూవీల రిలీజ్ కంటే ముందుగానే పది నిముషాల వీడియోని రిలీజ్ చేస్తున్నారు.
ఇది పబ్లిసిటీ స్టంట్ గా మారింది. ఆ విధంగా బాహుబలి2 మూవీని రిలీజ్ కంటే ముందుగా దాదాపు 10 నిముషాల వీడియోని రిలీజ్ చేయనున్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ కి సైతం బాహుబలి2 కి సంబంధించిన పూర్తి చిత్రాన్ని చూపించరు. ఈ పది నిముషాల వీడియోనే వారుకూడ చూడాల్సి ఉంటుంది. దీంతో బాహుబలి2 పది నిముషాల వీడియో ప్రేక్షకులకి ప్రత్యేకమైన క్రేజ్ ని క్రియేట్ చేస్తే…ఈ చిత్రానికి ఓ రేంజ్ లో డిమాండ్ ఉంటుందనేది చిత్రయూనిట్ వారి ప్రమోషన్ ప్లానింగ్ అని అంటున్నారు.
ఇక రాజమౌళి కొత్తగా ఆలోచించిన ఈ విధానం ఇప్పడు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్ ని నిద్రని పట్టనివ్వటం లేదు. ఎందుకంటే పది నిముషాల వీడియోని చూసి రైట్స్ ని కొనాలంటే కొంత సాహసమే అని అంటున్నారు. కానీ కొనకుండా కూర్చుంటే ఇతర డిస్ట్రిబ్యూటర్స్ ఆ మూవీని ధక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా బాహుబలి2 మూవీ రిలీజ్ కంటే ముందుగానే 10 నిముషాలు రిలీజ్ అయి, ఎటువంటి సంచనాలకు దారితీస్తుందో అని అందరూ ఆసక్తిని చూపుతున్నారు.
Read: బాహుబలి రిలీజ్ ఐతే థియేటర్లను తగులబెడుతారట!
Read: ఈ పది పాయింట్స్ చదివితే మీరు డైలీ సెక్స్ చేస్తారు
Post a Comment