సెన్సార్ టాక్ : 'బాహుబలి 2' ట్రైలర్


దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ రిలీజ్ కు దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఎక్కడ చూసిన సినీ అభిమానులు ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక రేపు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ గురించి అంత ఆరా తీయడం చేస్తున్నారు. అభిమానులైతే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి లో ట్రైలర్ లో ఏం చూపిస్తాడు..బాహుబలి , కట్టప్ప ల సీన్స్ కనిపిస్తాయా…సినిమా కథ ఏంటి అనేది ఏమైనా చెపుతాడా.. అని ఇలా ఎవరికీ వారే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ట్రైలర్ ఊపిరి బిగబట్టి చూసేంత గొప్పగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర టీమ్ ట్రైలర్ కు సంబందించిన అన్ని పనులు పూర్తి చేసింది. తాజాగా ట్రైలర్ సెన్సార్ కార్యక్రమాలను కూడా ముగించుకుంది. సెన్సార్ బోర్డు జారీ చేసిన U/A సర్టిఫికెట్ ప్రకారం ఈ ట్రైలర్ యొక్క రన్ టైమ్ 2 నిముషాల 20 సెకన్లుగా ఉంది. రేపు 16వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ కానున్న ఈ ట్రైలర్ ఏపి, తెలంగాణాల్లోని సుమారు 200 థియేర్లలో ప్రదర్శితం కానుంది.

అనంతరం సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ట్రైలర్ లో రాజమౌళి ఏం చూపించాడో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 

No comments