22 ఏళ్ల పూజ ఎలా చనిపోయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు పూజ. ముంబైలో నివసిస్తున్న ఈ యవతి ప్రమాదవశాత్తు తన తండ్రి చేతిలోనే చనిపోయింది. ఆమె చనిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోమవారం ఉదయం పూజ ఇంట్లో వాళ్లకు, పక్కింట్లో వాళ్లకు గొడవైంది. పూజ సోదరి మేఘన ఇంటి బయట బట్టలు ఉతుకుతోంది. ఆ బట్టలుతికిన నీళ్లు అనుకోకుండా సమీపంలో ఉన్న పొరుగింటి యజమాని సుభాష్ గోదేరావు మీద పడ్డాయి. అక్కడ నుంచి గొడవ మొదలైంది. ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. సాయంత్రానికి గొడవ సద్దుమణిగింది.
ఈ గొడవ గురించి ఏ మాత్రం తెలియని పూజ రాత్రి 8 గంటల సమయంలో ఇంటికొచ్చింది. జరిగిన గొడవ గురించి మేఘన పూజతో చెప్పింది. పూజ కొద్దిసేపటికి గోదేరావు ఇంటికి వెళ్లింది. మళ్లీ గొడవ మొదలైంది. గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. ఇంట్లో నుంచి మేఘన కూడా వచ్చి అక్క పక్కన నిల్చుంది. ఇంతలోనే ఇంట్లో కూరగాయలు కోస్తున్న పూజ తండ్రి రాజేష్ కూడా గొడవ జరుగుతున్న దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో కూరగాయలు కోస్తున్న కత్తి అతని చేతిలో ఉంది. గొడవ తారాస్థాయికి చేరింది. గోదేరావు కుటుంబ సభ్యులు రాజేష్‌ను తోసేశారు. ఈ తోపులాటలో రాజేష్ పక్కనే ఉన్న కూతురు పూజపై పడ్డాడు. అతని చేతిలో ఉన్న కత్తి సరాసరి పూజ ఛాతిలో దిగింది. దీంతో పూజ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ నొప్పితో విలపించింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే పూజ చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
Post a Comment