తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్ర ....గిరీశం
నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అని బడాయికోరు కబుర్లు చెపుతూ, అందరినీ
బురిడి కొట్టించి, చివరకు డామిట్! కథ అడ్డంగా తిరిగిందని మొహం చాటేసే దొంగ
పెద్దమనుష్యులకు నిలువుటద్దం గిరీశం. మన వాళ్లుత్త వెధవాయిలోయ్ అంటూ
స్వప్రయాజనాల కోసం ఇతరులను మోసపుచ్చి పబ్బంగడుపుకునే ఘరానా మనుష్యులకు
ప్రతీక గిరీశం. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టు, వేడకునో,
బ్రతిమాలో, నవ్వించో, ఏడ్పించో సామ, దాన, భేద, దండోపాయాలుపయోగించి ఇతరులను
లొంగపర్చుకునే లౌక్యుడు గిరీశం. గురజాడ అప్పారావు ఏ ప్రయోజనాన్ని ఆశించి
కన్యాశుల్కం నాటకంలో ఈ పాత్రకు రూపకల్పన చేశాడో కానీ, ఇలాంటి మనష్యులు నేటి
సమాజంలో కన్పిస్తూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు.
గిరీశం
గురజాడ సృష్టించిన హాస్య పాత్ర అంటే అందరూ ఒప్పుకోక పోవచ్చు. ప్రముఖ
విమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనం మాటల్లో చెప్పాలంటే, “గిరీశం పాత్రలో హాస్య
రసానుభూతి పొందాలంటే నీతి అనే కొలబద్దను తాత్కాలికం గా నైనా పక్కకు
పెట్టాల్సిందే. అప్పుడే గిరీశం మాటలు, సమయస్ఫూర్తి, మనకు ఆహ్లాదం
కలిగిస్తాయి.” పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకోవాలన్ని ఉబలాటపడే నాటి,
నేటి యువకులకు అతను ప్రతీక. అతనికి ఆర్ధిక స్తోమత లేదు. ఏది
సంపాదిన్చాలన్నా అడ్డదారే గతి అనుకొన్నాడు. జీవనాధారంలేని గిరీశం మాటలతో
మనుష్యులను మోసం చేయటం బాగా నేర్చుకున్నాడు. ఎదుటి వాడిని మాటలతో బురిడీ
కొట్టించే వాక్చాతుర్యం వుంది. అందుకే “నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్”
అన్నాడు అంత ధైర్యంగా. అనుకూల, ప్రతికూల పరిస్థితులను తనకు అనువుగా
మలుచుకోగల నేర్పరి గిరీశం.
ఇక గిరీశం పుట్టుపూర్వోత్తరాలకు వస్తే,
ఈయన స్వగ్రామం కాకినాడ. ఈయన ఎక్కడ పుట్టినా, రామచంద్రాపురం అగ్రహారంలో
పింతల్లిగారి వద్ద పెరిగాడు. గిరీశం ఆంగ్లభాషను ఔపోశన పట్టినట్టు బడాయిలు
పలికినా, చిన్నతనంలో మాత్రం వేదాలు, ఉపనిషత్తులు పుక్కిటపట్టారు. ఇక ఈయన
వేషభాషలంటారా, తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి పంచెకట్టు. అంతే తెల్లదనంతో
మెరిసిపోయే పొడుగుచేతల షర్టు. విలాసంగా నిలబడుతూ చుట్ట కాల్చడం అతగాడి
మార్కు. ఇక భాష విషయాని కొస్తే, ఆయన వాడిన కొన్ని మాటలు నేటికి ఆంధ్రుల
నోటిలో నానుతైనే ఉన్నాయి. ఉదాహరణకు, డామిట్ కథ అడ్డం తిరిగింది. ఈయనగారు
ధూమపానము గురించి చెప్పిన పద్యమైతే, పొగరాయుళ్లందరికీ ఆదర్శం...
కం. ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగత్రాగని వాడు దున్నపోతై బుట్టున్.
లోకంలోని ఉత్తముల పేర్లూ, చిక్కు లెక్కలు, చిక్కని కవిత్వం, కొంచెం
హిస్టరీ, కాస్త జాగర్ఫీ- ఇవన్నీ తన అవకాశవాద ప్రయాసలో వాడుకుంటాడు గిరీశం.
క్లుప్తంగా చెప్పాలంటే .. కొంచెం శకారుడు, కొంచెం ఫాల్‌స్టాఫ్, కొంత ఉత్తర
కుమార ప్రగల్భాలు అన్నీ కలగలిస్తే ఒక గిరీశం.
గిరీశం
నాతో
మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అని బడాయికోరు కబుర్లు చెపుతూ, అందరినీ బురిడి
కొట్టించి, చివరకు డామిట్! కథ అడ్డంగా తిరిగిందని మొహం చాటేసే దొంగ

Post a Comment