శ్రావణ పూర్ణిమ విశిష్టత ...రాఖీ రక్షని కట్టే సమయం మీకు తెలుసా ...??


శ్రావణ పూర్ణిమ విశిష్టత ......
రాఖీ రక్షని కట్టే సమయం మీకు తెలుసా ...?? రాఖీ కట్టడం వలన కలుగు ఫలితాలు .....
.
“యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః| తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల||”
భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది. ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. అందం, బంధం కలగలసిన పండుగ రాఖీ పౌర్ణమి. ఈ పండుగకు పురా ణాల ప్రకారం ఎన్నో అర్థాలున్నా, అన్నా చెల్లెళ్ల బాంధవ్యానికి, బాధ్యతకు ప్రతీకగానే దీనికి ఎక్కువ గుర్తింపు ఉంది.

పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.

అన్నదమ్ములు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తే అక్కచెల్లెలు వారికి హారతి ఇచ్చి, కుంకుమ దిద్ది, తీపి పదార్థాలను తినిపిస్తారు. అలాగే, రాఖీ కట్టి హారతి ఇచ్చి, కానుకలు ఇచ్చి పుచ్చుకోవడమూ ఆనవాయితీ! మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలోని వారు ఈ రోజున సమువూదాని కెళ్లి పూజ చేసి కొబ్బరికాయలను సమర్పిస్తారు. అందుకే, దీన్ని ‘నారికేళ పూర్ణిమ’, ‘నార్లీ పున్నమి’ అని కూడా అంటారు.

శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి . జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు

శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది.

ఈ రక్షని కట్టే సమయం మీకు తెలుసా ...??
శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది.

రక్షా బంధన కట్టడం పూర్తి అయింది కదా అని ఇక వదిలేయ కూడధు . మాటకి కట్టుబడి ఆ సంవత్సర కాలం పాటు ఆమెకి అన్నింటా అండగా నిలవాలి .

మరో ముఖ్య విశేషం ఏమిటి అంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలని నియమం ఎక్కడా లేదు . స్త్రీలకి స్త్రీలు , పురుషులకి పురుషులు కూడా కట్టొకోవచ్చు . ఇలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే .

స్థితి కారకుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమ రోజు నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను . కాబట్టి నిరంతరం లోకాన్ని రక్షిస్తూనే ఉండాలనే తపన గల ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించే నేను రక్షించే వాడి గా నేను ఉండాలని అర్దం చేసుకోవాలి . నా రక్ష బంధనానికి ఆ ప్రత్యక్ష సాక్షి సూర్యుడు అంధుకే మధ్యహన సమయం లో రక్ష ని కడతారు .

రాఖీ కట్టడం వలన కలుగు ఫలితాలు .....
బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెల పోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి, రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి, భ్రాతృ ప్రేమతో ‘ఏం కావాలమ్మా’ అని అభిమానంగా అడిగాడు. లక్ష్మి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. బలి మనసు ఆర్ద్రమైంది. సర్వం త్యాగం చేసి, లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసికెళ్ళమన్నాడు.

మహాభారతం ప్రకారం ద్రౌపదికి, వస్త్రాపహరణం సమయంలో, మహా రాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపద రాజు కానీ, ఉద్దండులయిన ఐదుగురు భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుని ప్రార్ధించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి, అవమానం నుండి తప్పించాడు. ఇది రాఖీ బంధనాన్ని సూచిస్తుంది.

దేవదానవ యుద్ధంలో దేవరాజ ఇంద్రుడు ఓ దానవ చక్రవర్తితో యుద్ధానికి తలపడతాడు. అపజయం వెన్నాడిన ఆ తరుణంలో దేవగురువు బృహస్పతి ఆదేశంతో ఆయన చేతిపై ఇంద్రుడు, ఆయన భార్య శచీదేవి రక్షాబంధనాన్ని ముడివేస్తారు. దీంతో దేవతల రక్షణ బాధ్యతను బృహస్పతి వహిస్తాడు. ఇలా రాక్షసులపై విజయాన్ని సాధించిన ఉదంతం ‘భవిష్య పురాణం’ ద్వారా బోధపడుతుంది.

భారతంలోని దుష్యంతోపాఖ్యానంలో కూడా ఈ రక్షాబంధన వృతాంతమున్నది. కుమారుడైన భరతునికి శత్రుభయం లేకుండా శకుంతల రక్ష కట్టింది. ఆ రక్ష మూలంగానే తదుపరి విధివశాత్తు విడిపోయిన శకుంతలా దుష్యంతుల పునఃస్సమాగమం సిద్ధించడమేగాక భరతుని దిగ్విజయ యశో చంద్రికా విస్తారానికి కూడా సహకరించింది. అంతేకాదు, శ్రీకృష్ణుని హితోపదేశానుసారం ధర్మరాజు కూడా ఈ రక్ష ధరించినట్లు భారత గాథ చెబుతోంది.

అలెగ్జాండరు చక్రవర్తి భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు పురుషోత్తముడనే రాజు ఆయనను ప్రతిఘటిస్తాడు. ఆయన ఆధిపత్య ప్రాభవాన్ని విని భయపడిన అలెగ్జాండరు భార్య పురుషోత్తముని కలిసి శ్రావణ పూర్ణిమనాడు రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండరుకు రక్షణ కోరుతుంది. ఆ మేరకు ఆయన తన మాటకు కట్టుబడి అలెగ్జాండరుకు హాని తలపెట్టకుండా లొంగిపోయి, విజయం ప్రాప్తింపజేసినట్లు చరిత్ర పుటలు చెబుతున్నయి.

ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కార్యోన్ముఖుడై బయలుదేరుతూ తన సోదరి సుభవూదాదేవితో రక్ష కట్టించుకొని విజయాన్ని సాధించినట్లు చెప్తాడు. తర్వాత విజయానికి ప్రతీకగా ఆమెకు అనేక కానుకలు సమర్పించాడట. అప్పటి నుంచి ఈ బంధం సోదరీ సోదరుల విజయబంధంగా వర్ధిల్లుతోంది.

1535లో రాణీ కర్ణావతి భర్త చనిపోయాడు. దాంతో గుజరాత్ సుల్తాన్ బహద్దూర్ షా, చిత్తూరుపై కన్నేశాడు. ఏ క్షణాన అయినా సుల్తాన్ దండెత్తిరావచ్చని గూఢచారుల ద్వారా విన్న రాణీ కర్ణావతి భయపడింది. బాగా ఆలోచించి, తనను కాపాడేవాడు మొఘల్ సామ్రాజ్యాధిపతి హుమాయూన్ చక్రవర్తే అని నమ్మింది. వెంటనే హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రాఖీ హుమాయూన్ మానసును గెలిచింది. కానీ అప్పటికే గుజరాత్ సుల్తాన్ చిత్తూరు కోతపై దాడి చేశాడు. హుమాయూన్ కు విషయం అర్ధం అయ్యేసరికి పరిస్థితి విషమించింది. రాణీ కర్ణావతితో సహా 13 వేలమంది స్త్రీలను సుల్తాన్ చేర పట్టాడు. హుమాయూన్ చిత్తూరు చేరేసరికి మహిళలందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుమాయూన్ చక్రవర్తి, గుజరాత్ సుల్తాన్ను ఓడించి, చిత్తూరు రాజ్యాన్ని రాణీ కర్ణావతి కొడుక్కు ఇప్పించాడు. హుమాయూన్ కు మాత్రం ఆమె పంపిన రాఖీ తీపి గుర్తుగా మిగిలిపోయింది.

వినాయకునికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు, శుభ్, లాభ్ అనే ఇద్దరు కొడుకులు. రక్షా బంధన్ రోజున, గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభ్, లాభ్, తల్లిదండ్రులను తమకో చెల్లెలు కావాలని కోరారు. గణపతి సంతృప్తికి సంకేతం అయిన సంతోషీ మాతను ప్రార్ధించగా ఆవిడ ఒక దివ్య శక్తిని ప్రసాదించింది. శ్రావణ పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్కచెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తికొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీటు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. సోదరులు దూరప్రాంతాల్లో ఉంటే, రాఖీలను పోస్టులో పంపిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది మరి. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టేవారు. కానీ ఈ సంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకూ పాకింది. అలాగే, సొంతవారికే కాకుండా, తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరసయ్యే వారికీ కడుతున్నారు. చుట్టరికంలోనే గాక, బంధుమిత్రుల పిల్లలు, పక్కింటివారు, స్నేహితులు ఇలా ఎవరికైనా రాఖీ కడుతున్నారు. కాలేజీల్లో తమ వెంటబడి పోకిరీ వేషాలు వేసే అబ్బాయిల్ని రాఖీతో వదిలించుకునే అమ్మాయిలకీ లోటు లేదు.

No comments