పాకిస్థాన్ కు బిగుస్తున్న‌ ఉచ్చు!

తీవ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటున్న దాయాది దేశమైన పాకిస్థాన్ కు రోజు రోజు ఉచ్చు బిగుసుకుంటోంది. పాక్ దేశ వ్య‌వ‌హార శైలీని ప‌లు దేశాలు త‌ప్పుబ‌డుతున్నాయి. తాజాగా అగ్ర‌రాజ్యం అమెరికా సైతం పాక్ సాయం చేయ‌బోమ‌ని తేల్చిచెప్పింది. ఉగ్ర‌వాదం పేరు చెప్పి అమెరికా నుంచి సాయాన్ని పాక్ త‌న స‌రిహ‌ద్దుల విస్త‌ర‌ణ కు ఉప‌యోగించ‌డం ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది. అయితే ఇది ఇక‌పై కొన‌సాగే అవ‌కాశం లేదు. ఒబామా ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని పాక్ కు స్ప‌ష్టం చేసింద‌ని స‌మాచారం! అంతేకాక పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్  త‌మ ప్ర‌తిపాదిత అమెరిక ప‌ర్య‌ట‌న‌లో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాల‌నే ష‌ర‌త్తులు కూడా విధించనుంది. ష‌రీస్ అమెరికా పర్య‌ట‌న గురించి పాకిస్థాన్ మీడియా లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నా, దాని గురించి త‌మ ప్ర‌భుత్వం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని అమెరికా ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ఒక‌రు పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్ర‌ధాని అమెరికా పర్య‌ట‌న గురించి ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని అమెరికా అధ్య‌క్షుని ప్ర‌త్యేక స‌ల‌హాయ‌కుడు, ద‌క్షిణాసియా వ్య‌వ‌హారాల సీనియ‌ర్ డైర‌క్ట‌ర్ పీట‌ర్ లెవోయ్ తెలిపారు.

పాక్ ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా నిర్వహిస్తున్న పోరాట విష‌యంలో తాము సంతృప్తి చెందితే త‌ప్ప తాము దానికి ఆమోద తెలిపేది లేద‌ని అమెరికా ప్ర‌క‌టించింది. దీంతో పాక్ ప్ర‌ధాని ష‌రీష్ అమెరికా ప‌ర్య‌ట‌న విష‌యంలో ఆయ‌న ఆచితూచి స్పందించారు. ఉగ్ర‌వాదంపై పోరు స‌మ‌ర్థ‌వంతంగా ఉంద‌ని భావిస్తే త‌ప్ప పాక్ కు సీఎస్ ఎఫ్ నిధులు విడుద‌ల చేస్తామ‌ని అమెరికా తెలిపింది. పాక్ ఉగ్ర‌వాదం పై నిర్వహించే పోరులో సైనిక అవ‌స‌రాల‌కు సాయం పేరుతో అమెరికా ఈ సాయం అందిస్తోంది. గ‌తంలో ఆప్ఘ‌నిస్థాన్ లోని సంయుక్త కూట‌మి ద‌ళాల‌కు మ‌ద్ద‌తు నిచ్చినందుకు పాక్ కు గతంలో అమెరికా నుంచి ఆర్ధిక సాయం అందుకుంటూ వ‌చ్చింది. నాటి నుంచి పాకిస్థాన్ అమెరికా నుంచి 1300 కోట్ల డాల‌ర్ల సాయం పొందింది. మ‌రో పక్క పాకిస్థాన్ సైనిక ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ తాలిబ‌న్ అధిప‌తి ముల్లా ఒమ‌ర్ అనారోగ్యం తో మర‌ణించడాన్ని, మ‌రో ఉగ్ర‌వాద సంస్థ నాయ‌కుడు జ‌లాలుద్దీన్ హ‌క్కా మ‌ర‌ణాన్ని అమెరికా కు తెలుకుండా పాక్ సైన్యం  గోప్యంగా ఉంచింది. 

అంతేకాకుండా అబోట‌బాద్ లో ఒసామా బిన్ లాడెన్ ఉండ‌గా అమెరికా ద‌ళాలు దాడి చేసి కాల్చి చంపటం, పాకిస్థాన్ ఉగ్ర‌వాదానికి సాయాన్ని కొన‌సాగించ‌డం, ముంబై పై ఉగ్ర‌వాదుల దాడుల్లో ఆరుగురు అమెరిక‌న్లు మ‌ర‌ణించ‌డం వంటి అనేక సంఘ‌ట‌న‌లు జరిగాయి. ఇవ‌న్నీ జరిగినా..పాక్ ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్పుకూల‌కుండా అమెరికా ఆ దేశానికి సాయం కొన‌సాగిస్తూ వ‌స్తోంది. ఈ వ్య‌వ‌హారాల‌తో అమెరికా నిధుల విష‌యంలో పున‌రాలోచించే స్థితి రావ‌డం, పాకిస్థాన్ అమెరికా మ‌ధ్య సంబంధాల‌కు విఘాతం క‌లిగించేలాఉంది. ఇప్ప‌టికే పాక్ ఆర్ధిక వ్య‌వ‌స్థ చాలా క‌ష్టాల్లో ఉంది. అక్క‌డ జ‌నాభాకు, ఆర్థిక ప్ర‌గ‌తికి పొంత‌న లేకపొవ‌డం తో ఆ దేశం విదేశాల నుంచి వ‌చ్చే సాయం పైనే ఆధార‌ప‌డ‌వ‌ల‌సి వ‌స్తోంది. మ‌రో ప‌క్క సాయం అందే గ‌ల్ఫ్ దేశాల నుంచి అడ‌టం లేదు. మిత్ర దేశ‌మైన చైనా సైతం ఆర్థిక సాయంతో ముందుకు రావ‌డంలేదు. ఎలాగైనా అమెరికా నుంచి సాయం కొన‌సాగేలా చూసేందుకు వ‌జీరిస్థాన్ లో ఉగ్ర‌వాదుల‌పై దాడులు చేస్తున్నామ‌ని, వారిని హ‌త‌మారుస్తున్నామ‌ని పాక్ ప్ర‌భుత్వం, సైన్యం ప్ర‌క‌టిస్తున్నాయి.

ఆ ప్రాంతానికి వెళ్లి ఆ వార్త‌ల‌ను ధ్రువీక‌రించుకొవ‌డ క‌ష్టం క‌నుక ఆ వార్త‌లు ఎంత‌వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది తెలుసుకునే అవ‌కాశం లేదు. అయితే ముంబై దాడుల సూత్ర‌ధారులు..హాఫీజ్ స‌యిద్ జియా ఉర్ రెహ‌మాన్ ల‌ఖ్వీ, దావూద్ ఇబ్ర‌హీం వంటి వారి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వారి అస‌లు ఉద్దేశాల‌ను వెల్ల‌డిస్తూనే ఉన్నాయి . ఆప్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాలు వైదొల‌గ‌డం, ఇరాన్ తో అమెరికా సంప్ర‌దింపులు జ‌రుపుతున్న  ఈ ప‌రిస్థితుల్లో ఆమెరికా పాక్ ను మంచి చేసుకుని వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని వారితో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చ‌ని, ఆ స‌మ‌యం ఆస‌న్నమైంద‌ని కూడా ఇటీవ‌ల ఇద్ద‌రు ప్ర‌ముఖ విశ్లేష‌కులు త‌మ వ్యాసంలో పేర్కొన్నారు.

ముంబై వ‌రుస పేలుళ్ల ఘ‌ట‌న‌లో

1993 ముంబై వ‌రుస పేలుళ్ల ఘ‌ట‌న‌లో ప్ర‌దాన సూత్ర‌దారి, భార‌త్ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ దావూద్ ఇబ్ర‌హీం పాకిస్థాన్ లోనే  ఉన్నాడ‌ని భార‌త నిఘా వ‌ర్గాలు క‌నుగొన్నాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా వెల్ల‌డించాయి. దావూద్ కు పాక్ ప్ర‌భుత్వం కాపాడుకుంటూ వ‌స్తోంద‌ని భార‌త్ ప్ర‌భుత్వ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌య్యాయి. అయితే దావూద్ త‌మ దేశంలో నివ‌సించ‌డం లేద‌ని పాక్ ఎల్ల‌ప్పుడూ చెబుతూ వ‌చ్చింది. కానీ ఇప్పుడు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌పంచం ముందు నిర్ధిష్ట సాక్ష్యాన్ని ఉంచారు. దీంతో పాక్ కు మ‌రోసారి సందిగ్ధంలో ప‌డ‌క తప్ప‌లేదు. అంతేకాకుండా ఈ నెల 24 న భార‌త్- పాక్ ఎన్ఎస్ఎ స్థాయి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌బోమ‌ని భార‌త్ తేల్చి చెప్పింది. ఉగ్ర‌వాదం పై చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని భావించిన భార‌త్ కు పాక్ త‌న పాత బుద్దినే చూపించింది. కాశ్మీర్ పై చ‌ర్చ‌లు, వేర్పాటువాదుల‌తో స‌మావేశం అనంత‌రం ఉగ్ర‌వాదం చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని పాక్ తెలిపింది. దీనికి త‌మ‌కు అంగీకార యోగ్యం కాద‌ని భార‌త్ సుస్పష్టం చేసింది.

దీంతో మ‌రోసారి పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ది ప్ర‌పంచ‌దేశాల‌కు తెలిసిపోయింది. ఇక పాక్ ఉగ్ర‌వాదుల‌ను పెట్టిపోషిస్తోంద‌ని తెలియ‌జేయాటానికి భార‌త్ వ‌ద్ద సాక్ష్యాల‌తో, ప్ర‌పంచ‌దేశాలు పాక్ పై తీవ్ర అసంతృప్తి ఉన్నాయని తెలుస్తోంది. దీంతో దిక్కుతొచ‌ని ప‌రిస్థితుల్లో ప‌డ్డ పాక్ ఏం చేయాల్లో అర్ధంకాని దీన‌స్థితికి చేరుకుంది. ఇకనైనా పాకిస్థాన్ త‌న దేశాభివృద్ది దృష్టిలో పెట్టుకుని ప‌లు దేశాల‌తో స్నేహ భావంతో ఉండాల‌ని లేక‌పోతే పాకిస్థాన్ ప‌రిస్థితి ఉహించ‌డానికే క‌ష్టత‌రంగా మారే అవ‌కాశ‌లు ఉన్నాయ‌ని ప్ర‌పంచ మేధావులు హెచ్చ‌రిస్తున్నారు.

source:apherald.com

No comments