ఓ బాపు ఇందుకేనా నువ్వు స్వాతంత్రం తెచ్చింది..?
‘స్వాతంత్ర దినోత్సవం’ తెళ్ళ వాళ్ళ చెర నుండి భరతమాతను బంధీ విముఖ్తిని చేసిన రోజు. బుద్ధి బలం, ఆత్మ బలం, కండ బలంతో ఎదురించి బెదిరించి ఎన్నో ఉద్యామాలు చేసి, ఎన్నో ప్రాణాలను బలిస్తే కాని మన తల్లిని మనం కాపాడుకోలేకపోయాం. స్వాంతంత్రం వచ్చింది కాని పరిస్థితి మాత్రం ఏం మారలేదు. మళ్లీ తెల్లవాళ్ళ హయాం లానే నేటి నాయకుల పరిపాలనా దక్షత కనబడుతుంది. ఉడికే రక్తంతో మెరుపు వేగంతో ఉరకలు వేయాల్సిన యువతీ యువకులు ఫేస్ బుక్, ట్విట్టర్ లంటూ సమయాన్ని వృధా చేస్తూ సోమరిపోతుల్లా తయారవుతున్నారు.
స్వతంత్ర సమర యుద్ధంలో ఎంతో మంది మహానుభావుల ప్రాణాలు బేకాతరు చేయకుండా అసువులు బాసారు. ఇన్ని చేసి మన భరతమాతకి స్వాతంత్రం తెచ్చినా మనం పొందిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించుకుంటే, ఎక్కడ మొలెట్టామో అక్కడే ఉన్నామనిపిస్తుంది.ఈ కలియుగంలో మనిషి జంతువు కన్నా హీనంగా తయారవుతున్నాడు. చట్టాలు న్యాయాలు ఉన్నా సరే అన్యానికి గురైన ప్రతి ఒక్కరు అన్యాయన్ని జయించలేకపోతున్నారు.
ఆడది అర్ధ రాత్రి నడిరోడ్డుపై నడిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే అని చెప్పారు. కాని అలా నడిచే ఆడదాన్ని మానవ మృగాలు స్వేచ్చగా ఉండనిస్తున్నాయా..? ఈ మనిషి రూపంలో ఉన్న మగ అణుబాంబు నుండి ఒక ‘స్త్రీ’ ఎప్పుడు తనని తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొంచం ఆదమరిచినా తను ఎక్కడకు వెళ్తుందో, ఏమైపోతుందో ఆ విధికే తెలియాలి. నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది. ఇలాంటి అన్యాయం జరిగిన 6 నెలలకో, 6 సంవత్సరాలకో పరిస్థితి తీవ్రతను బట్టి సమస్య పరిష్కరించడం కాదు, ఎప్పుడు మొదలైందో అప్పుడే అణచివేస్తే ఇక ఇలాంటి సంఘటనలు జరిగే ఆస్కారం ఉండదు.
ఎంతో మంది మహానుభావుల మృత్యువు ఘోషిస్తుంది. ఓ భారతీయుడా దేశాన్ని గెలుపు బాట పట్టించు, అభివృద్ధి బాటలో తీసుకెళ్ళు, కాని భారతీయులు మాత్రం అవకాశాన్ని అందుకుని దేశ పరువుని గంగలో కలిపేస్తున్నారు. చివరగా చెప్పదలచుకున్నది ఒక్కటే ఓ బాపు ఇందుకేనా నువ్వు స్వాతంత్రం తెచ్చింది. దేశ అభివృద్ధికి పాలుపడే యువకులు వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాజకీయ నాయకులు తమ తమ స్వార్ధాలకే తమ పదవులను వాడెసుకుంటున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ అన్యాయం రెచ్చిపోతుంది. ఇదంతా చూసి పైన మీరు బాధపడుతున్నారని తెలుసు కాని దీన్ని మార్చాలంటే మరో మహాత్మ పుట్టుకురావాల్సిందే.
నా దేశం చాలా గొప్పది, నా దేశ ప్రజలు చాలా తెలివైనవారు, దేశ పురోగతిని దశ దిశలళ్ళా చాటి చెప్పేలా కష్టపడుతున్నా ఓ భరతమాత బిడ్డలారా మీరందిరికి పేరు పేరునా సాష్టాంగ నమాస్కారాలు చేస్తున్నాను. అందుకోండి నాయి శుభాస్సీస్సులు.. భారతీయుడిగా పుట్టినందుకు గర్వ పడుతూ అందరికి స్వాతంత్రదీనోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది TRENDI INDIA.
source: apherald.com
Post a Comment