వామ్మో..!! అనుష్కను రెండు కళ్లతో చూడలేమా..!!
తెలుగు ఇండస్ట్రీలో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున సరసన మెరుపులా కనిపించి తన అందంతో ఇట్టే ఆకర్షించిన బెంగుళూరి బ్యూటీ అనుష్క. తర్వాత ఈ తెలుగు, తమిళ అగ్ర హీరోల సరసన నటిస్తూ నెం.1 స్థానానికి వెళ్లిన ఈ అమ్మడు సిని ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఏ మాత్రం క్రేజీ తగ్గని హీరోయిన్. స్వతగాహా అనుష్క యోగా గురువు. శరీర సౌష్టవాన్ని చాలా అందంగా మలుచుకోగల హీరోయిన్. ఈ బెంగుళూరు బ్యూటీకి తెలుగు లో మంచి హిట్స్ ఉన్నా.. ‘అరుంధతి’ ‘బాహుబలి’ రాబోయే చిత్రం రుద్రమదేవి చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రాలు అని ఒక సందర్భంలో తెలిపింది.
తాజాగా పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది. ఇందులో అనుష్క గత సినిమాల కంటే భిన్నంగా లావుగా కనిపించబోతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తు చాలా సాంప్రదాయమైన మహిళగా అనుష్క కనిపించింది.తాజాగా సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ చూస్తే అందరి కళ్లు తిరిగిపోన్నాయి...అసలు అనుష్క నేనా ఫిట్ నెస్ కే కొత్త అర్ధం చెప్పిన అనుష్కను చూసిన అభిమానులు ఆమె భారీ కాయంతో ఉండటాన్ని చూసి షాకవుతున్నారు. డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.
Post a Comment