సర్దార్ గబ్బర్ సింగ్ బయట పడ్డాడు !
అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కూడ నిన్న అర్దరాత్రి బయట పడ్డాడు. 69వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలలో తాను కూడ ఉన్నాను అంటూ ‘జైహింద్’ నినాదంతో దేశ ప్రజలకు స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ పవన్ తాను నటిస్తున్న సినిమా టైటిల్ ను అధికారికంగా ఈ ఫిస్ట్ లుక్ ద్వారా ప్రకటించాడు.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ అంటే ధైర్యం-ప్రేమ-గన్స్ అంటూ ఈసినిమాలోని కీలకాంశాలను ఈ ఫస్ట్ లుక్ లో కూడ రేఖామాత్రంగా తెలియచేస్తూ తాను ఎన్ని షేడ్స్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడో తన అభిమానులకు లీక్ ఇచ్చాడు పవన్.
ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటున్న ఈసినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి ఎట్టి పరిస్థుతులలోను రాబోతున్న సంక్రాంతికి ఈసినిమాను విడుదల చేయాలనే పట్టుదలలో పవన్ ఉన్నట్లు టాక్. పవన్ ఆలోచనలలో మార్పు రాకుండా ఉంటే ఈసినిమా సంక్రాంతికి పూర్తి చేయడం కష్టం కాదు అని ఈసినిమా యూనిట్ భావిస్తున్నట్లు టాక్.
మొట్టమొదటిసారిగా కాజల్ పవన్ తో నటించబోతున్న ఈసినిమా షూటింగ్ కనీసం 20% కూడ పూర్తి కాకుండానే ఈసినిమా పై ఈరోస్ సంస్థ అప్పుడే భారీ ఆఫర్ తో కన్నేసింది అంటే ఈ సినిమా పట్ల అంచనాలు ఎలా ఉన్నాయో అర్ధం అవుతుంది..
source: apherald.com
Post a Comment