నరరూప రాక్షసుడు హిట్లర్.... జీవిత చరిత్ర
హిట్లర్ జీవిత చరిత్ర
హిట్లర్
లేదా అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) (జననం: 20 ఏప్రిల్ 1889 - మరణం: 30 ఏప్రిల్
1945) 1933 నుండి జర్మనీ ఛాన్సలర్ గాను 1934 నుండి మరణించే వరకు జర్మనీ నేత(ఫ్యూరర్
fuhrer) గాను వ్యవహరించిన వ్యక్తి. ఇతడు నేషనల్ సోషలిసట్ జర్మన్ వర్కరస్ పార్టీ
(దీనినే నాజీ పార్టీ అంటారు) వ్యవస్థాపకుడు.
బాల్యము మరియు
వంశ వివరాలు
హిట్లర్
ఏప్రిల్ 20, 1889 న బ్రౌనౌ అం ఇన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు ఈ గ్రామం
ఎగువ ఆస్ట్రియా, జర్మనీ దేశ సరిహద్దులలో ఉంది. ఆరుగురు పిల్లలలో హిట్లర్ నాలుగోవవాడు
మరియు మూడవ మగ బిడ్డ. హిట్లర్ తండ్రి అలోఇస్ హిట్లర్ (అసలు పేరు శ్చిక్కల్ గ్రుబర్)
వాణిజ్య శాఖలో గుమాస్తా. హిట్లర్ తల్లి క్లారా పోలజ్ (1860–1907), అలోఇస్ కు రెండవ
మరదలు మరియు మూడవ భార్య. వీరికి కలిగిన ఆరుగురు సంతనంలో హిట్లర్ మరియు అతని చెల్లెలు
పౌలా మాత్రమే బతికారు. అలోఇస్ జూనియర్, ఏంజెలా, ఈ ఇద్దరు అలోఇస్ కు రెండవ భార్య వలన
కలిగిన సంతానం. అలోఇస్ మొదటి భార్యకు పిల్లలు లేరు.
అలోఇస్ హిట్లర్
(హిట్లర్ తండ్రి) ఆక్రమ సంతానం. తన జీవితపు తొలి 39 సంవత్సరాలు అతడు తన తల్లి ఇంటి
పేరునే తన ఇంటి పేరుగా చేర్చుకున్నాడు. 1876 లో జనాభా లెక్కల ప్రకారం ఒక గుమస్తా ఇతని
సవతి తండ్రి 'జోహానన్ గెఒరగ్ హైడ్లార్' ను అలోఇస్ తండ్రిగా పేర్కొన్నాడు. ఆ పేరు
రకరకాలుగా పిలవబడి చివరకు 'హిట్లర్' గా స్థిరపడింది. పురాతన జర్మన్ భాషలో 'హిట్లర్'
అంటే గుడిశె లో నివసించే వాడని అర్థం. తరువాత సంవత్సరాలలో హిట్లర్ తన శత్రువుల చేతిలో
ఈ విషయంలో హేళనకు గురియాడు.
జర్మనీలో హిట్లర్
ఈ శతాబ్దంలో చేసిన మారణహొమం చరిత్రలో మరువరానిది. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసిన హిట్లర్
జర్మనీ ఓటమి వలన అవమానంచెందాడు. పగతీర్చు కోవాలనే పట్టుదల వహించాడు. యుద్ధానికి ముందే
వియన్నామేయర్ కార్త్లూగెర్ నుండి సోషలిస్టు భావాలను, జార్జివాన్ షొవెరర్ నుండి యూదుల
పట్ల ద్వేషాన్ని నేర్చుకున్న హిట్లర్. సైన్యానికి రాజకీయ విద్య గడాపాలనే విథానాన్ని
లుడెస్ డారప్ నుండి తెలుసుకున్నాడు.
1919లో మ్యూనిచ్లో
సైన్యానికి రాజకీయ బోధకుడైన హిట్లర్ ఆ ఏడు సెప్టెంబరులో రాజకీయ పార్టీ స్థాపించాడు.
1920 ఏప్రియల్లో సైన్యానికి గుడ్ బై చెప్పి, పూర్తి రాజకీయవాది అయ్యాడు. హిట్లర్ పెట్టిన
నాజీపార్టీలో 1923 నాటికి 4800 మంది సభ్యులు చేరగా అందులో 345 మంది కార్మికులే.
1923 నవంబరు
8న 3 వేల మందితో హిట్లర్ బవేరియాలో స్థానిక ప్రభుత్వాధికారులపై దాడి జరిపి, నిర్భంధించి
ప్రభుత్వాన్ని ఏర్పరచినట్లు ప్రకటించాడు. కాని పోలీసులు కాల్పులు జరిపి హిట్లర్ ను
నిర్భంధించి జైలు శిక్ష విధించారు. జైల్లొ వుండగా తన భావాలను అమలు చేయదలచిన రీతులను
క్రోడీకరించి మైన్ క్వాంప్ అనే గ్రంథాన్ని వ్రాశాడు. 1924 డిశెంబరు 20న విడుదలైన హిట్లర్,
నాజీభావాలతో విజృంభించాడు. యూదులకు వ్యతిరేక నినాదంతో 1926 నాటికి తన పార్టీపై పూర్తి
ఆదిపత్యాన్ని సాధించిన హిట్లర్ ధారాళంగా మాట్లాడి మంచి వక్తగా తన ప్రేక్షకులను సమోహితుల్ని
చేస్తుండేవాడు.
1928 ఎన్నికలలో
హిట్లర్ పార్టీకి 28 శాతం ఓటు మాత్రమే వచ్చింది. కమ్యూనిస్టులకు ఎక్కువ శాతం ఓట్లు
వచ్చాయి. అప్పటి నుండి ఏటా నాజీ పార్టి పెరిగిపోయింది. 1932 నాటికి హిట్లర్ పార్టిలో
8 లక్షల మంది చేరారు. అప్పటికే నిరుద్యోగ సమస్యచూపి హిట్లర్ విద్యార్ధులను ఆకర్షించాడు.
జాతీయవాద పార్టి హిట్లర్ ను వాడుకుందామని కావలసిన ధనాన్ని సమకూర్చిపెట్టగా అది నాజీలకు
తోడ్పడింది. హిట్లర్ వస్తే కాసేపట్లో పడగొట్టి తాము పెత్తనం చేయవచ్చని కమ్యూనిస్టులు,
మితవాదులు తప్పుడు అంచనా వేశారు.
1932 ఎన్నికలలో
హిట్లర్ నాజీలకు 37.2 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి నుండి నాజీలు కమ్యూనిస్టులు వీధుల్లో
కుక్కలవలె పోట్లాడుకుని జర్మనీ అంతా భీభత్సం గావించారు. అయేడు నవంబరులో జరిగిన ఎన్నికలలో
కమ్యూనిస్టులకు 100 సీట్లు రాగా మితవాదులు బలపడి 196 సీట్లున్న హిట్లర్ కు మరింత బలాన్ని
సమకూర్చిపెట్టారు. సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడింది. 1933 జనవరి 30న హిట్లర్ ఛాన్సలర్
అయ్యాడు.
ప్రపంచ చరిత్రలో
అదొక పెద్ద దురదృష్టకర మలుపు. అధికారంలోకి వచ్చిన హిట్లర్ 25 వేల మందితో టార్చ్ లైట్
పెరేడ్ చేయించాడు.
1933 ఫిబ్రవరి
28న పూర్తి హక్కులు తనకు దత్తం చేసుకుంటూ హిట్లర్ ఆర్డినెన్స్ జారీ చేశాడు. అంతేగాక
లాంఛన ప్రాయంగా ఆఖరుసారి తన ఆర్డినెస్ చర్చకు పెట్టి హిట్లర్ పార్లమెంటు ఆమోదాన్ని
కూడా పొందాడు. అప్పటికే 81 మంది కమ్యూనిస్టు సభ్యులు పారిపోవడమో, అరెస్టు కావడమో జరిగింది.
441 ఓట్లు హిట్లర్ కు రాగా 94 మంది వ్యతిరేకించారు.అప్పటి నుండి
కమ్యూనిస్టులను దారుణంగా హతమార్చడం ఆరంభమైంది. కొందరు కమ్యూనిస్టులు బ్రతుకు జీవుడా
అని రష్యాలో తలదాచుకోవడానికి వెడితే ఉరిత్రాడే ఎదురైంది.
1933 జూన్లో నాజీపార్టీ
తప్ప మిగిలిన పార్టీలను నిషేదించారు. కొద్ది వారాలలోనే హిట్లర్ అనుమతితో గోరింగ్ జర్మనీ
కమ్యూనిస్టు పార్టీని తుడిచిపెట్టాడు.
నాలుగు విధాలైన
రహస్య పోలీస్ కేంద్రాలను హిట్లర్ ఏర్పరచి, ఒకరికి తెలియకుండా మరొకరిని తన దహన కాండకు
వాడుకున్నాడు. గోరింగ్, హిమ్లర్ ఇందుకు తోడ్పడ్డారు దేశమంతటా నిర్భంధ శిబిరాలు వెలిశాయి.
హిట్లర్ వాక్యమే చట్టం, న్యాయంగా జర్మనీలో 10 ఏళ్ళపాటు ఆటవిక పాలన సాగింది. జడ్జీలను
సైతం డిస్మిస్ చేసే అధికారాలను హిట్లర్ సంక్రమింపజేసుకున్నాడు. ప్రజాకోర్టులు పెట్టి
అక్కడక్కడే తీర్పు యిచ్చే పద్దతులు ప్రవేశపెట్టాడు. మంత్రిమండలి సమావేశాల్లో నిర్ణయాలన్ని
హిట్లర్ తీసుకునేవాడు.
హిట్లర్ అధికారంలోకి
రాగానే యూదులను ఊచకోత ఆరంభించాడు. కొందరిని దేశం వదలి పారిపోనిచ్చాడు. వారి ఆస్తుల్ని
కొల్లగొట్టడం, స్వాధీనం చేసుకోవడం సర్వ సాదారణమైపోయింది. పేర్లలో గందరగోళం లెకుండా
యూదులందరినీ ఇజ్రాయిలీ అని తెలిసేటట్లు నామకరణం చేయమన్నాడు. 1938 నవంబరు 8న యూదులను
చీల్చి ఛండాడారు.
జర్మనీ ఆధ్యక్షుడు
హిండెన్ బర్గ్ చనిపోవడంతో హిట్లర్ ఆ అధికారాలుకూడా సంక్రమింప జేసుకున్నాడు. జర్మనీలో
ఎవరినీ చంపేయాలో ఒక జాబితాను సిద్ధం చేసి హింలెర్, హైడ్రిక్లు యిరువురు హిట్లర్ కు
సమర్పించారు. పెన్సిల్ తో హిట్లర్ గుర్తు పెట్టి వారందరినీ కాల్చి చంపమన్నాడు. ఎప్పటికప్పుడు
కాల్చేసిన వారి జాబితాను. ఇంకా కాల్చవలసిన వారి జా
బితాను హిట్లర్, గోరింగ్, హిమ్లర్
చూస్తుండేవారు. రాజకీయ శత్రువులందరినీ ముందు హతమార్చారు. పాతకక్షలు తీర్చుకోవడానికి
మరి కొందరిని మట్టుబెట్టారు.
చంపేసిన ప్రముఖులలో
బవేరియా ప్రధాని గస్టావ్ వాన్ కర్, నాజీ పార్టీలో హిట్లర్ ప్రత్యర్ధి గ్రెగార్ స్ర్టాసర్,
జనరల్ వాన్ స్లెషర్ అతని భార్య, జనరల్ వాన్ బ్రెడోవ్ కాథలిక్ నాయకుడు ఎర్నెస్ క్లాజనర్,
మరో 150 మంది రాజకీయ వాదులను ముందుగా చంపేశారు. జర్మనీలో హిట్లర్ అధి కారాలపై జనవాక్య
సేకరణ, చేస్తే 84.6 శాతం అనుకూలంగా చేశారు.
జర్మనీ రెండో
ప్రపంచ యుద్ధంలోకీ పోవడం అక్కడి ప్రజలకు యిష్టంలేదు పోలండ్ను జయించివచ్చిన తరువాత ప్రజలు
సంతోషంగా స్వాగతాలు పలుకలేదు. హిట్లర్ స్వయంగా సర్వసైన్యాధిపత్యం వహించాడు. మెరుపు
దాడులతో యూరప్ను హడలగొట్టిన హిట్లర్ ఫ్రాన్స్ పైదాడి జరిపాడు. ఆ దాడిలో 27 వేల మంది
జర్మన్లు చనిపోగా 135000 మంది ప్రత్యర్ధి సైన్యాలు పోయాయి.
ఒక వైపు ఇటలీ నియంత
ముసోలినీతోను మరో ప్రక్క రష్యా నియంత స్టాలిన్తో ఒడంబడికలు చేసుకోగలిగిన హిట్లర్ కు
పట్టపగ్గాలు లేకుండాపోయాయి. హంగరీ, రొమేనియా, యుగస్లేవియా, బల్గేరియాలపై హిట్లర్ దాడులు
జరిపి విపరీత నష్టాలకు గురిచేశాడు. గ్రీకు, ఉత్తర ఆఫ్రికాలు అచిరకాలంలో జర్మనీకి దాసోహం
అయినాయి.
1941 జూన్లో జర్మనులు
ఆక్రమించుకున్న రష్యా భూభాగంలో 5 లక్షల మంది యూదుల్ని కాల్చి చంపారు. యూదుజాతిని నామరూపాలు
లేకుండా చేయాలన్న హిట్లర్ ఉత్తరువులననుసరించి యీ చర్యగైకొన్నారు. వీరితో పాటు రష్యన్లను
కూడా చంపారనుకోండి. న్యూరంబరగ్ లో 1941లో 90 వేల మంది యూదు పురుష, స్ర్తీ, పిల్లలను
కాల్చి చంపారు. ఆ తరువాత రష్యా మేల్కొని జర్మన్ సైన్యాలను తిప్పి కొట్టకపోతే ఇంకెలా
వుండేదో.
రెండో ప్రపంచ
యుద్ధంలో మిత్రరాజ్యాలు జర్మనీపై ఎదురుదాడి జరిపినప్పుడు సుమారు 6 లక్షల జర్మన్ లు
చనిపోయారని అంచనా.
1939 సెప్టెంబరు
1న హిట్లర్ ఉత్తరువులు ఆధారంగా ప్రపధమంగా 90 వేల మందిని గ్యాస్ చంబెర్సు లో పెట్టి
చంపారు. 1941 జులై 31న హిట్లర్ మరో ఉత్తరువుయిస్తూ యూదులను తుడిచిపెట్టమన్నాడు. ఎలా
చంపాలో ఐక్ మస్, హైడ్రిక్ల ఆధ్వర్యాన ఒక చర్చా సదస్సు కూడా జరిగింది. 1941 ఆగస్టులో
పట్టుబడిన రష్యా యుద్ధ ఖైదీలను జైక్లాన్-బితో 500 మందిని చంపారు. పురుగుల నివారణ కంపెనీ
డెగ్షే (degesch) యీ మందును తయారు చేసి గ్యాస్ నిమిత్తం అందించింది.
1942 మార్చి
17న బెల్జక్ శిబిరంలో మూకుమ్మడి హత్యా కాండ ఆరంభమైంది. 15 వేల మందిని యీ శిబిరంలో చంపారు.
దాని శక్తి అంతేవున్నదట. సోబిబోర్ కేంప్ లో రోజుకు 20 వేల మందిని గ్యాస్ తో చంపారు.
టెబ్లింకా, మెడనక్ కేంప్ లలో 25 వేల మంది చొప్పున మరణించారు. ఆప్ విట్జ్ అన్నింటికంటే
పెద్ద మరణాల శిబిరంగా తయారైనది.
1941లో 87 లక్షల
యూదులు జర్మనీలో వున్నారు. ఇందులో 58లక్షల మందిని 1945 నాటికి హిట్లర్ చంపించగలిగాడు.
పోలండ్ నుండి పట్టుబడిన 26 లక్షల మందిని, రష్యా నుండి 7 లక్షల మందిని, రొమేనియా నుండి
అంతే మందిని హంగరీలో 4 లక్షల మందిని, చకస్లోవేకియాలో రెండున్నర లక్ష, ఫ్రాన్స్లో లక్షకు
కొంచెం తక్కువ, లాట్వియాలో 70 వేలు, గ్రీసులో 65 వేలు, అంతే సంఖ్యలో ఆస్ర్టియాలో, యుగస్లేవియాలో
60 వేలు, బల్గేరియాలో 40వేలు, బెల్జియంలో 28 వేలు, ఇటలీలో 9 వేలమంది యూదులను కసిగా
హిట్లర్ మట్టుబెట్టించాడు.
జర్మనీలో యీ యూదులను
చంపడానికి అనేక కంపెనీలు పోటీబడి, శిబిరాలలో గ్యాస్ ఛాంబర్లు ఏర్పరచి, హిట్లర్ దాహాన్ని
తీర్చాయి. ఆష్ విటజ్ శిబిరంలో 20 లక్షల మందిని చంపి ప్రథమస్థానం తెచ్చుకున్నది.
యూదులందరినీ చంపాలనే
హిట్లర్ కోర్కె తీరలేదు. ఇంకా మిగిలిపోయారు, ఇందులో ఇంకో గొడవ ఏమంటే, హిట్లర్ కు తెలియకుండా
కొందరు యూదులను నిర్భంద కార్మికులుగా కొన్ని కర్మాగారాలకు హిమ్ యూదులందరినీ చంపాలనే
హిట్లర్ కోర్కె తీరలేదు. ఇంకా మిగిలిపోయారు, ఇందులో ఇంకో గొడవ ఏమంటే, హిట్లర్ కు తెలియకుండా
కొందరు యూదులను నిర్భంద కార్మికులుగా కొన్ని కర్మాగారాలకు హిమ్ లర్ అప్పగించి, వారివద్ద
డబ్బుతిన్నాడు. ఆ విధంగా కొందరు బ్రతికిపోయారు.
ప్రతిరోజు రైళ్ళలో
యూదుల్ని చేరవేసి, అందులో అనారోగ్యవంతుల్ని ఏరి, ముందుగా గ్యాస్ తో చంపేవారు. యూదుల
వస్తువులన్నీ ఏరి, వేలం వేసేవారు. హిమ్లర్ యూదుల అస్తి పంజరాలలో మేలైనవి ఏరి ప్రదర్శనకై
అట్టిపెట్టాడు.
ఈ మరణ శిబిరాల
నుండి సాధారణంగా ఎవరూ బయటపడలేదు. 1944 ఆగస్టులో ఇద్దరు యూదులు ఎలాగో తప్పించుకున్నారు.
యూదులతో బాటు
ఇతరులను కూడా ఈ చిత్ర హింసకు గురిచేయడం వలన, దారుణం జరిగిపోయినది.
యుద్ధపు చివరి
రోజులలో సోవియట్ రష్యా కు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరం లోనికి ప్రవేశించగానే హిట్లర్
ఆ ముందురోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్ తో కలిసి ఒక నేలమాళిగలో ఏప్రిల్
30, 1945 మధ్యాహ్నం 3.30 కి ఆత్మ హత్య చేసుకొన్నాడు.
Post a Comment