పవన్ ని తిరస్కరించిన త్రివిక్రం
పవన్ కల్యాణ్, త్రివిక్రం ల మద్య ఉన్న స్నెహ బంధం గురించి అందరికీ తెలిసినదే. పవన్ తో అతిసన్నిహితంగా ఉండే వ్యక్తులలో మొదట గుర్తొచ్చేది త్రివిక్రం శ్రీనివాస్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ' అత్తారింటికి దారేది ' సినిమా తరువాత వీరిద్దరి మద్య స్నేహం ఇంకా పెరిగింది. పవన్ తన సొంత పార్టీ ' జన సేన ' ప్రారంబించినప్పుడు పార్టీ సిద్దాంతాల గురించి త్రివిక్రం తో చాలా లోతుగా చర్చించాడని వార్తలు కూడా వచ్చాయి.
అంతే కాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో ' కోబలి ' ఎదో ఒక రోజు వచ్చే అవకాశం ఉందని వార్త్లు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే వీరిద్దరి మద్య సినిమా బంధం కంటే ఎక్కువ గా పర్సనల్ బాండింగ్ ఉందని కూడా అందరికీ తెలిసినదే. అయితే వీరిద్దరి మద్య ఉన్న స్నేహ బంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.
దానికంతటికీ కారణం పవన్ ఇప్పుడు నటిస్తున్న సినిమా ' సర్ధార్ ' అనే అంటున్నారు. ఈ సినిమాకు గాను తయారు చేసిన స్చ్రిప్ట్ ను ఒకసారి పరిసీలించవలసిందిగా పవన్ స్వయంగా త్రివిక్రం ని కోరినట్టుగా వార్తలొచాయి. అయితే ఈ మాటల మాంత్రికుడు స్చ్రిప్ట్ ను పరిసీలించే విషయంలో పవన్ కోరికను సున్నితం గా తిరస్కరించినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.
దీనితో ఈ స్చ్రిప్ట్ ను పరిసీలించే పని కోసం పవన్ కోన వెంకట్ ని రంగంలోకి దించినట్టు వార్తలొస్తునాయి. అయితే ఈ వార్తల గురించి త్రివిక్రం సన్నిహితులు, ప్రస్తుతం త్రివిక్రం నితిన్ సినిమా స్చ్రిప్ట్ పనిలో బిజీగా ఉండటమే అని చెబుతున్నారు. అయితే గతం లో త్రివిక్రం సినిమా ' సన్నాప్ సత్యమూర్తి ' ఆడియో ఫంక్షన్ కి పవన్ రావాల్సిందిగా ఎన్నిసార్లు కోరినా పవన్ దగ్గర నుండి రెస్పాన్స్ రాకపోవడంతో త్రివిక్రం అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా ప్రవర్తించాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఎలా వున్నా కానీ ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో మాంచి హాట్ టాపిక్ గా మారిపోయింది.
Post a Comment