డాడీ, బాబాయ్ లతో రామ్ చరణ్ గేమ్

ఒక చేతి వేళ్ళు అన్నీ ఒకేలా ఉండవు. కాని ఆ చేతికి ఐదు వేళ్ళు ఉంటేనే అందం అంటున్నారు మన పెద్దవాళ్ళు. సరిగ్గా ఇదే ఫార్ములాను తీసుకొని రామ్ చరణ్ ప్రస్తుతం ఓ సుసాధ్యమైన పనిని సాధ్యం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఒకప్పుడు కలిసి ఉన్నా ఎవరికి వారే అన్న రీతిలో ఉన్న మెగా ఫ్యామిలీ.. ఇప్పుడు అందరూ ఒకే తాటిపై వచ్చి చేతి వేళ్ళు బిగించబోతున్నారు.

ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అందరికి ఒక దారైతే పవన్ కళ్యాణ్ మాత్రం సపరేటు రూటు. అందుకే పవన్ కళ్యాణ్ కి కావాల్సినంత ప్రీడంని చిరు ఇచ్చేశాడు. ప్రస్తుత కాలంలో చిరు, పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగిందనేది ఇండస్ట్రీలోనూ, అటు పొలిటికల్ లోనూ ఓపెన్ టాక్స్ వినిపిస్తురన్నాయి.  ఈ ఓపెన్ టాక్స్ బ్రేక్ చేప్పే రోజు దగ్గరపడింది. రామ్ చరణ్ సారధ్యంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఒకే తాటిపైకి రాబోతున్నారు. ఇందుకు అల్లుఅర్జున్ కూడ చరణ్ కి సహాయం చేస్తున్నాడు.

ఇంతకీ రామ్ చరణ్ చేస్తున్నదేంటి అని అనుకుంటున్నారా? ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న క్లియర్ టాక్స్ ప్రకారం చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఇద్దరు ఒకే బాటలో ఉండాలనే, ఇలా సపరేటు రాజకీయాలు వద్దని రామ్ చరణ్ తన డాడీతోనూ, అలాగే బాబాయ్ తోనూ ఎంతో కాలంగా ఫైట్ చేస్తున్నాడంట. చివరకి చరణ్ ప్రయత్నాలు ఫలితాన్ని తీసుకువచ్చిందని అంటున్నారు.

త్వరలోనే చిరు, పవన్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని, అలాగే రామ్ చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాత ఓ మూవీ ప్లాన్  జరుగుతుందని ఇండస్ట్రీ న్యూస్. ఇంకొంచెం వివరాల్లోకి వెళితే 2018లో మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన మూవి సెట్స్ మీదకు వెళ్ళనుందని కూడ టాక్స్ వినిపిస్తున్నాయి. వీటన్నింటికి కారణం చరణే అని మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న సమాచారం.
source:http://www.apherald.com/Movies/ViewArticle/91074/ram-charan-pawan-kalian-tollywoo-chiranjeevi-allu-/

No comments