రాజమౌళి - మహెష్ కాంబినేషన్ లో 'జేమ్స్ బాండ్' ?!!!
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇప్పటికే 350కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే గత కొన్ని రోజులుగా రాజమౌళి - మహేష్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబందించి తాజాగా మహేష్ స్పందించారు.
మీడియాకు ఎదురుపడ్డ మహేష్ త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో తాను నటిస్తానని దానికి సంబందించిన వివరాలు తొందరలోనే చెబుతానని అన్నారు. ఇంకా దీనికి సంబందించిన కధా చర్చలు జరుగుతున్నాయని అని కూడా హింట్ ఇచ్చారు.
అంటే రాజమౌళి బాహుబలి-2 తర్వార తన తదుపరి సినిమా మహేష్ తోనే అని ఇంకా 2016 లో వీరి సినిమా మెదలయ్యే అవకాశం ఉందని క్లారిటీ వచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినబడుతున్నాయి.
అయితే ఇప్పటికే రాజమౌళి జానపద జోనర్ లో బాహుబలి ని తెరకెక్కించగా, తన జోనర్ ని మార్చి జేమ్స్ బాండ్ తరహా లో, అంతే బారీ బడ్జెట్ తో, గ్రఫిక్స్ తో సినిమా రూపొందిస్తే మహెష్ కి కరెక్ట్ గా సూట్ అవుతుందని రాజమౌళి అనుకుంటునట్టు టాక్.
Post a Comment