మహేష్ ‘టపోరి’గా హ్యాట్రిక్ కొడతాడా..?!!
ఎవరు కొడితే దిమ్మతిరి మైండ్ బ్లాక్ అవుతుందో.. వాడే పండుగాడు..ఇలాంటి మాస్ పవర్ ఫుల్ డైలాగ్ కొట్టింది ఎవరో అందిరికీ తెలుసు మన ప్రిన్స్ మహేష్ బాబు.. మరి కొట్టించింది ఎవరు పవర్ ఫుల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ అప్పటి వరకు తెలుగు చలన చిత్ర రంగంలో ఉన్న రికార్డులన్నీ కొల్లగొట్టింది. తర్వాత వచ్చి ‘బిజినెస్ మేన్’ సినిమా కూడా మంచి హిట్ టాక్ వచ్చింది. తాజాగా పూరీ జగన్నాధ్ ఓ స్టోరిలైన్ మహేష్ బాబుకు చెప్పాడట బాగా ఇంప్రెస్ అయిన మహేష్ ఆ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హేష్ బాబు ప్రస్తుతం శ్రీమంతుడు చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ పూర్తీ కావొచ్చింది. ఈ సినిమా తరువాత అయన బ్రహ్మోస్తవం సినిమాలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. వాస్తవానికి శ్రీమంతుడు జూలై నెలలోనే విడుదల కావాల్సింది కానీ ‘బాహుబలి’ సినిమా వల్ల పోస్టు పోన్ అయ్యింది. ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కాబోతుంది. పూరి, మహేష్ కాంబినేష్ హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉండబోతున్నాయి. అంతే కాదు ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యిందని , దీనికి ‘టపోరి’ అనే టైటిలే కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంచి మాస్ టైటిల్ మూడు అక్షరాలే.. మహేష్ బాబు హ్యాట్రిక్ సాధిస్తాడని అభిమానులు సంతోషంగా ఉన్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/89824/businessman-telugu-movie-princ-mahesh-babu-puri-ja/

Post a Comment