పవన్ ను టార్గెట్ చేస్తున్న జ్యోతిలక్ష్మి !

పవన్ కళ్యాణ్ పూరిజగన్నాథ్ ల మధ్య ఉన్న సానిహిత్యం అందరికీ తెలిసిన విషయమే. అటువంటి పూరి పవన్ ను టార్గెట్ చేస్తూ తాను  లేటెస్ట్ గా డైరెక్ట్ చేసిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో ఒక డైలాగ్ పెట్టాడు అన్న వార్తలు పవన్ అభిమానులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఛార్మీ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా పాటల ట్రాక్ లిస్టును ఈసినిమా యూనిట్ విడుదల చేసిన నేపధ్యంలో పూరి పవన్ ను వ్యూహాత్మకంగా వాడుకున్న నేపధ్యం బయట పడింది.

వచ్చే వారం జూన్ 12 న విడుదల కాబోతున్న ఈసినిమాలో ‘జ్యోతిలక్ష్మి నన్ను టచ్ చేయాలంటే చాల ఖరీదు.’ అనే ఫంకీ మాస్ మసాల పాట ఉంది. అయితే ఈ పాట మధ్యలో జ్యోతిలక్ష్మి ‘రాస్కోరా సాంబా’ అంటూ పవన్ ‘గబ్బర్ సింగ్’ లోని పంచ్ డైలాగ్ వాడుతుంది. పూరీజగన్నాథ్ ఆస్థాన పాటల రచయిత భాస్కరభట్ల ఈపాటను రాసాడు.

ఇప్పుడు ఈపాటలోని మాటాలు పవన్ అభిమానులకు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కూడ పూరి తాను దర్శకత్వం వహించిన అల్లుఅర్జున్ ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమాలో ‘ప్రతివెధవ పవన్ కళ్యాణ్ ఫ్యాన్’ అంటూ బ్రహ్మానందం చేత సెటైర్ వేయించి పవన్ అభిమానులకు కోపం తెప్పించాడు. ఇప్పుడు కూడ అదేవిధంగా ‘జ్యోతిలక్షి’ చేసే డాన్స్ పాటలో పవన్ పంచ్ డైలాగ్ వాడటం ఏమిటి అని పవన్ అభిమానులు పూరీజగన్నాథ్ పై కోపంగా ఉన్నారని తెలుస్తోంది.

పవన్ ఫోటోలు కటౌట్లు పాటలు వాడుకుంటూ తమ సినిమాలాను హిట్ చేసుకుందామని చాల మంది దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లే పూరీ కూడ అదే ప్రయత్నాన్ని తన ‘జ్యోతిలక్ష్మి’ లో చేస్తున్నాడు అని అనిపిస్తోంది. కాని కాల్ గర్ల్ పాత్రను చేస్తున్న ఛార్మీ డాన్స్ చేస్తూ పాడే పాటలో పవన్ ప్రస్తావన రావడం ఎంత వరకు పవన్ అభిమానులు హర్షిస్తారు అన్న విషయం ఈ సినిమా చూస్తే కాని తెలియదు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88423/JYOTHILAKSHMI-TARGETTING-PAVAN/

No comments