యూ ట్యూబ్ కి షేక్ చేస్తున్న తెలుగు మూవీలు

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. కేవలం అందుకు రెండు సినిమాలే కారణం. ప్రధానం ఒక సినిమా కోసం యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తాజాగా మహేష్ నటిస్తోన్న ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌లుక్ టీజర్ మే 31న విడుదలైన విషయం తెలిసిందే!

ఈ టీజర్ విడుదల అయిన ఒక్క రోజులోనే 1 మిలియన్ హిట్స్ ని సాధించి మహేష్ స్టామినా ఏంటో నిరూపించింది. ఇక ఈ సినిమాకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. టీజర్ అయిన రోజు శ్రీమంతుడు ఈ రెండు సోషల్ సైట్లలో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. అలాగే దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు.

బాహుబలికి సంబంధించిన కొత్త పోస్టర్ గానీ, సమాచారం గానీ ఏది విడుదలైన అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలవడం సహజంగా మారిపోయింది. ఇక బాహుబలి టీజర్, ట్రైలర్‌ వీడియోలు అయితే యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. బాహుబలి హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లోని ట్రైలర్‌లు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌గా నిలిచాయి. మొత్తంగా ప్రస్తుతానికి తెలుగు సినిమాల హావా మళ్ళీ పునరావృతమౌతుందనే చెప్పాలి.
source;http://www.apherald.com/Movies/ViewArticle/88453/bahubali-bahubali-movie-dil-raju-rana-ranaprabhas-/

No comments