బాహుబలి థియోట్రికల్ ట్రైలర్ ఎందుకు నచ్ఛలేదు?
దాదాపు 3 సంవత్సరాలు నుండి సౌత్ ఇండస్ట్రీని ఎంతగానో ఊరిస్తున్న సినిమా బాహుబలి. ఇక ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రానే వచ్చింది. అతి త్వరలోనే రిలీజ్ కూడ కాబోతుంది. అయితే తాజాగా రిలీజ్ అయిన బాహుబలి థియోట్రికల్ ట్రైలర్ నచ్ఛిందా? లేదా? అనే క్వశ్ఛన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల మదిలో మొదులుతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’.
‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను ఇంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో చాలా వినూత్నంగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఏది చేసినా సరికొత్తగా ఉండాలనుకునే దర్శకుడు రాజమౌళి, బాహుబలి ట్రైలర్ రిలీజ్‌లోనూ తన మార్క్ చూపెట్టారు. ఈ ఉదయం 10:30కు ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణాల్లోని 250కి పైగా థియేటర్లలో బాహుబలి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కోసం అభిమానులు అన్ని చోట్లా బారులు తీరడం విశేషం.
అభిమానులు ఎంతో ఉత్సాహంగా ట్రైలర్‌ను ఎంజాయ్ చేశారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి ట్రైలర్‌ను చూసినవారంతా అద్భుతమైన అనుభూతికి లోనైనట్లు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రభాస్, రానాల స్టన్నింగ్ లుక్స్,రాజమౌళి మార్క్ టేకింగ్, ఎమ్.ఎమ్.కీరవాణి స్టన్నింగ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్‌తో బాహుబలి ట్రైలర్ సూపర్బ్ అనిపించుకుంది. ఇక “నన్నెప్పుడూ చూడని కళ్ళు దేవుడిలా చూస్తున్నాయి.. నేనేవర్ణి?” అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌కు అభిమానులు ఈలలతో థియేటర్లలో హల్‌చల్ చేశారు.
రెండు నిమిషాల ట్రైలరే ఈ స్థాయి అనుభూతి కలిగిస్తే, ఇక పూర్తి సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందోనని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అంతా అనుకున్నట్టుగానే బాహుబలి ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇలా బాహుబలి పొగడ్తలు ఒక ఎత్తైతే, బాహుబలి ట్రైలర్ కి మరో నెగిటివ్ కోణం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తిరుగు లేని మూవీగా ఉంటుందనుకున్న ట్రైలర్, సాధారణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రిలీజ్ చేయటం అనేది కొంత అసంత్రుప్తిని మిగిల్చింది.
ట్రైలర్ లో వస్తున్న విజువల్స్ కి, బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ కి పొంతన కుదరకపోవడంతో, విజువల్ చూస్తున్న ప్రేక్షకుడు కొంత కన్ ఫ్యూజన్ లో పడిపోయాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు నిలబెట్టే సినిమా కాబట్టి, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆదరించాలనే సానుభూతి కూడ బాహుబలి మూవీపై ఉంది. అయితే బాహబలి లాంటి ఎక్స్ ట్రీమ్ టైటిల్ కి తగ్గట్టు, ట్రైలర్ లో గొప్ప సన్నివేశాలు అంటూ ఒకటి రెండు తప్పితే ఎక్కడా కనిపించలేదు. మొత్తంగా బాహుబలి ట్రైలర్ కొత్తగా ఉంది....అలాగే కొంత పాతగా ఉంది అనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
Theatrical Trailer Official
source:http://www.apherald.com/Movies/ViewArticle/88333/bahubali-bahubali-movie-dil-raju-rana-ranaprabhas-/

Post a Comment