మీడియా కు హాట్ టాపిక్ గా మారిన డూప్లికేట్ ప్రభాస్ న్యూస్ !

సినిమాలలో నటించే టాప్ హీరోలు అందరికీ డూప్ లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. కొన్నికొన్ని ప్రమాదకరమైన ఫైట్ సీన్స్ టాప్ హీరోల బదులు ఈ డూప్ లు చేస్తూ ఒకొక్కసారి తమ ప్రాణం పైకి కూడ తెచ్చుకుంటూ ఉంటారు. ఈ విషయంలో ప్రభాస్ కు డూప్ గా నటిస్తున్న కిరణ్ రాజ్ ప్రభాస్ తో కలిసి తీయించుకున్న ఫోటో ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ సినిమాలో ఈ కిరణ్ రాజ్ ప్రభాస్ కు బదులు కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ సీన్స్ లో నటించాడు అని తెలుస్తోంది. ప్రభాస్ లాగే 6 అడుగుల పైన ఎత్తు మంచి ఫిజిక్ ఉన్న ఈ కిరణ్ రాజ్ ‘బాహుబలి’ కోసం భారీ శరీరాన్ని ప్రభాస్ లా పెంచడమే కాకుండా ప్రభాస్ లాగే ఒత్తుగా గెడ్డం కూడ పెంచుకుని ఈ ఫోటోలో ఇలా సందడి చేస్తున్నాడు.

గతంలో కూడ ఈ కిరణ్ రాజ్ ప్రభాస్ సినిమాలలో డూప్ గా నటించి అతడి మూమెంట్స్ ప్రభాస్ కు సరిగ్గా సరిపోయిన నేపధ్యంలో రాజమౌళి ఏరికోరి ఈ కిరణ్ రాజ్ ను ‘బాహుబలి’ లో ప్రభాస్ డూప్ గా ఎంపిక చేసాడు అని టాక్. ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రంలో డూప్ గా నటించినా అది తనకు జీవితంలో కలిగిన అరుదైన అవకాశం అని కిరణ్ రజ్ కామెంట్ చేసాడు అంటే ‘బాహుబలి’ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్ధం అవుతుంది.

అందుకే సూర్యా లాంటి టాప్ హీరోలు కూడ ‘బాహుబలి 2’ లో కనీసం ఒక గెస్ట్ పాత్ర అయినా ఇమ్మని బహిరంగంగా రాజమౌళిని అడగడం బట్టి ఈ సినిమా రేంజ్ ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఏది ఎలా ఉన్నా ఈ డూప్లికేట్ ప్రభాస్ రూపం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/88315/DUPLICATE-PRABHAS-NEWS-BECOMES-HOT-NEWS-TO-MEDIA-/

No comments